/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T204013.451-jpg.webp)
Chennai: నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth), అల్లుడు ధనుష్ (Dhanush)లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపించింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు 2ఏళ్ల క్రితం 2022 జనవరిలో ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకేందుకు ఇటీవలే విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai family court)కు దరఖాస్తు చేసుకున్నారు.
Happens to be a Friday ..early start and shooting in an age old Amman temple …can call it coincidence or sometimes I believe god has her own sweet small ways of communicating with her child😇🌸🙏🏼#blessingsindisguise #lovemyjob pic.twitter.com/xxqHF9RgtN
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) March 17, 2023
ఇది కూడా చదవండి: Prasanth Varma: ‘హనుమాన్’ డైరెక్టర్ కు బాలీవుడ్ ఆఫర్స్.. క్యూ కడుతున్న మేకర్స్!
పరస్పర అంగీకారంతో విడాకులు..
ఇందులో భాగంగానే సెక్షన్ 13బీ కింద పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్టోబర్ 7న ధనుష్ – ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది. ఇదిలావుంటే.. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ సోషల్ మీడియా వేదికగా డమ డివోర్స్ ను ప్రకటించారు. 2004 నవంబర్ 18న వీరిద్దరూ వివాహం చేసుకోగా.. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
An absolute honour sir 🙏 https://t.co/fBZGSi3XPF
— Dhanush (@dhanushkraja) February 19, 2024