Dangerous Mangos: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే!

సమ్మర్ అంటేనే మ్యాంగోస్ స్పెషల్. అయితే.. మార్కెట్లో దొరికే అన్ని మామిడి పండ్లు మంచివి కావు. ఇటీవల హైదరాబాద్ పోలీసులు రసాయనాలతో పండించిన రూ.12 లక్షల విలువైన ప్రమాదకర మామిడి పండ్లను సీజ్ చేయడంతో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
Dangerous Mangos: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే!

Chemically Ripened Mangoes in Hyderabad: వేసవి కాలంలో మాత్రమే దొరికే పండు మామిడి పండు. దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఈ సీజన్ వస్తోంది అంటే పిల్లా పెద్దా అందరూ మామిడి పళ్ళ కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. కనబడగానే కొనేస్తుంటారు కూడా. మామిడి పళ్ళంటే అందరికీ అంత పిచ్చి ఉంటుంది. వీటి కోసం తోటలకు, పెద్ద మార్కెట్లకు పరుగులు పెట్టే జనాలూ ఉంటారు. అయితే ఇలా మామిడి పళ్ళ కోసం పరుగులు పెట్టేవాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. ప్రస్తుతం వేసవి మొదలు అయినా ఇంకా మామిడి సీజన్ మొదలు కాలేదని...అయినా పళ్ళు వస్తున్నాయి. అరే ముందే వచ్చేశాయని సంబరపడి తిన్నారో అంతే ఇక అని హెచ్చరిస్తున్నారు.
Chemically Ripened Mangoes in Hyderabad

కల్తీ కల్తీ..

ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎందులో చూసినా కల్తీనే రాజ్యమేలుతోంది. అసలు ఏది, నకిలీ ఏది అని తెలుసుకోలేనంతగా కల్తీలు జరుగుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణాల వలన .. సహజంగా కొన్ని ఆహార పదార్ధాలు కలుషితం అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం వల్ల మరికొన్ని కలుషితం అవుతున్నాయి. అది కాక పనిగట్టుకుని కొందరు ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నారు. కేవలం డబ్బు సంపాదనే ముఖ్యమనుకుని చేస్తున్న ఈ పనుల వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు తినే చాక్లేట్లు, ఐస్ క్రీమ్స్, పీచు మిఠాయి, నకిలీ అల్లం పేస్ట్ లు, సాస్ లు ఇలా ఒకటి రెండు కాదు. దాదాపు తినే ఆహార పదార్ధాలు అన్ని కూడా కల్తీ అవుతూనే ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా..కల్తీ దందాలు చేసేవారు మాత్రం రెచ్చిపోతునే ఉన్నారు. రకరకాల కెమికల్స్ ఉపయోగించి మరీ ఆహారపదార్ధాలను కలుషితం చేసి పడేస్తున్నారు.
publive-image

మామిడీకీ అంటుకున్న కల్తీ..
ఇప్పుడు ఈ కల్తీ ఆహార పదార్ధాల జాబితాలో మామిడి పళ్ళు కూడా చేరాయి. ఒకప్పుడు మామిడి అంటే సహజసిద్ధంగా పండించనవే దొరికేవి. కానీ ఇప్పుడు సీజన్‌ కంటే ముందే మామిడి పళ్ళను మార్కెట్లోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకోవాలనే యావతో...పళ్ళను రకరకాలుగా పండించేస్తున్నారు. దీంతో మార్కెట్లో నకిలీ మామికాయలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో మార్కెట్ లో నిగ నిగలాడుతూ .. పసుపు పచ్చ రంగుతో ఆకర్షించే మామిడి పండ్లన్నీ కూడా కృత్రిమంగా మందులతో పండించినవే. దీనికి సంబంధించి కృత్రిమంగా మామిడికాయలను మగ్గపెడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెమికల్స్ ఉపయోగించి పండించిన 12.61 లక్షల విలువగల మామిడి పళ్ళను సీజ్ చేశారు.

కృత్రిమ రసాయనాలతో.. 

ఎథిలీన్, కాల్షియం కార్బైడ్ అనే రసాయనాలను ఉపయోగించి మామిడిపళ్ళను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇవి రసాయనాలు మానవుల ఆరోగ్యానికి చాలా ప్రధానమైనవి. ఇవి కేన్సర్ కారకాలు కూడా. ఇవి కలిసిన ఆహారపదార్ధాలు కడుపులోకి పోతే కాలేయ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదొక్కటే కాదు మరికొన్ని చిన్న చిన్న జబ్బులు కూడా అటాక్ చేయవచ్చునని డాక్టరు చెబుతున్నారు. నోటి పుండ్లు రావడం, జ్వరం, చర్య సమస్యలు వంటి జబ్బులకు ఈ కెమికల్స్ దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. పళ్ళ మీద కెమికల్‌ను ఎంత నీటితో కడిగినా పోదని అంటున్నారు. ఎన్నిసార్లు కడిగినా..కొంత భాగం కడుపులోకి వెళుతుందని చెబుతున్నారు.
publive-image

నిజమైన మామిడి పండ్లను గుర్తించడం ఎలా..

నిజమైన మామిడిని గుర్తించడానికి మందు దాని వాసనను చూడాలి. మంచిగా, సహజంగా పండిన మామిడి పండు చాలా కమ్మని వాసన వస్తుంది. కృత్రిమంగా పండించిన పళ్ళకు అసలు వాసనే ఉండదు. ఒకవేళ ఉన్నా అది అదొకరకంగా ఉంటుంది. అలాగే మామిడిని కొంటున్నప్పుడు దాని పరిమాణాన్ని పరిశీలించాలి. మామిడి పండ్లను చాలా చిన్నగా లేదా చాలా పెద్దదిగా కొనకూడదు. ఎప్పుడూ మీడియం సైజు మామిడి పండ్లను మాత్రమే కొనాలి.

Chemically Ripened Mangoes in Hyderabad

నీటిలో వేసి చూస్తే తెలిసిపోతుంది...

నిజమైన మామిడి పండ్లను పరీక్షించడానికి, ఒక పెద్ద పాత్రలో నీటితో నింపాలి. అందులో మామిడిపండు వేసిన తర్వాత అది నీటి తేలితే కనుక కచ్చితంగా నకిలీదని గుర్తించాలి. సహజంగా పండిన మామిడి నీళ్ళల్లో మునుగుతుంది. అలాగే మామిడిపండుని కోసిన తర్వాత దాని నుండి రసం కారకపోతే అదికచ్చితంగా కెమికల్స్‌తో పండించినదే అవుతుంది. నిజమైన మామిడిలో చాలా ఎక్కువగా రసం ఉంటుంది. అలాగే రంగు చూసి కూడా మామిడిని సపిగట్టవచ్చును. రసాయనిక పద్ధతిలో పండిన మామిడిపళ్ళల్లో ఆకుపచ్చని మచ్చలు కనిపిస్తాయి...అదే నిజమైనవి అయితే పసుపు రంగులో ఉండి, దానిపై చిన్న నల్ల మచ్చలు ఉంటాయి. దాంతో పాటూ సహజంగా పండిన మామిడి పండు కాండం పచ్చగా, తాజాగా ఉంటుంది. కృత్రిమ మామిడి కాండం పొడిగా, గోధుమ రంగులో ఉంటుంది.

Also Read:Kavitha: ఈడీ ఆఫీస్ లో కవిత ఉపవాసం.. ఏ పుస్తకాలు చదువుతున్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు