April 1 Changes : క్రెడిట్ కార్డ్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకు.. ఏప్రిల్ 1 నుంచి జరగబోయే అది పెద్ద మార్పులివే!

ఈపీఎఫ్‌ఓ నిబంధనలలో ఏప్రిల్‌ 1 నుంచి పెద్ద మార్పు రానుంది. జాబ్‌ మారితే ఆ ఉద్యోగి EPFO ​​ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ అవుతుంది. అటు క్రేడిట కార్డ్‌ నియమాలు కూడా మారనున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
April 1 Changes : క్రెడిట్ కార్డ్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ వరకు.. ఏప్రిల్ 1 నుంచి జరగబోయే అది పెద్ద మార్పులివే!

Credit Card - FASTag : మార్చి నెల ఇవాళ్టితో ముగియనుంది. రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(Financial Year) ప్రారంభం కానుంది. ప్రతి నెల మొదటి తేదీన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి కూడా చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డ్, EPFO, ఫాస్టాగ్‌ లాంటి అనేక మార్పులు ఉన్నాయి. ఈ మార్పులు నేరుగా సామాన్యుల జేబులపై ప్రభావం చూపుతాయి. అందుకే ఏప్రిల్ 1 నుంచి జరగబోయే ఈ మార్పుల గురించి మీరు ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ నియమాలు:
ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నియమాలలో కూడా మార్పులు ఉండబోతున్నాయి. ఇందులో SBI క్రెడిట్ కార్డ్ నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతాయి. కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ ద్వారా ఛార్జీల చెల్లింపుపై ఇకపై రివార్డ్ పాయింట్లు జారీ చేయబడవు. ఈ నియమం ఏప్రిల్ 15, 2024 నుంచి అనేక ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తించవచ్చు.

EPFO నియమాలు:
ఏప్రిల్ 1 నుంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిబంధనలలో పెద్ద మార్పు రానుంది. ఇప్పుడు ఉద్యోగం మారితే, ఉద్యోగి EPFO ​​ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త యజమానికి బదిలీ చేయబడుతుంది. ఇంతకుముందు, ఖాతాదారుల అభ్యర్థనపై మాత్రమే ఖాతాలను బదిలీ చేసేవారు.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ:
ఏప్రిల్ 1లోపు KYCని అప్‌డేట్ చేయాలని NHAI ప్రజలను కోరింది. అలా చేయడంలో విఫలమైతే మీ ఫాస్టాగ్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. దీని తర్వాత మీ ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ మీరు మీ టోల్ చెల్లించలేరు. మీరు ఏప్రిల్ 1లోపు KYCని అప్‌డేట్ చేయడం అవసరం.

గ్యాస్ ధరలు:
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన మారుతూ ఉంటాయి. అందుకే ఏప్రిల్ 1న వాణిజ్య, గృహ గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పు ఉండవచ్చు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ధరలు పెరిగే అవకాశాలు చాలా తక్కువ.

Also Read : 155.5KM.. టీమిండియా స్పీడ్‌ సెన్సేషన్.. ఎవరీ మయాంక యాదవ్?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం, నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

New Update
Stock Markets Today:మంచిరోజు...లాభాల్లో స్టాక్ మార్కెట్

ట్రంప్ టారిఫ్‌లకు కాస్త బ్రేక్ పడినట్లే. దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. వీటితో పాటు ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించడం వల్ల సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభం.. నిఫ్టీ 23వేల మార్క్‌పైన ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాయి. మార్నింగ్ 9.30 గంటల టైంలో సెన్సెక్స్‌ 1564 పాయింట్లతో 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లతో 23,288 దగ్గర కొనసాగుతోంది. నేడు టాటా మోటార్స్‌, లార్సెన్‌, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే షేర్లు నష్టాల్లో ట్రేడ్‌వుతున్నాయి.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment