Chandrababu Case Update : నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ నేటితో ముగుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఒకసారి చంద్రబాబుకు రిమాండ్ ఎసిబి కోర్టు పొడిగించింది. గత నెల 24 న వర్చువల్ గా ఎసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు జైలు అధికారులు. నేటితో రిమాండ్ గడువు ముగుస్తు ఉండటంతో.. మరోసారి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా చంద్రబాబును హాజరు పరుచనున్నారు. ప్రస్తుతం బెయిలు పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను నేడు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Chandrababu Case Update : నేటితో ముగుస్తున్న చంద్రబాబు రిమాండ్..నెక్ట్స్ ఏం జరగబోతోంది..!!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు రిమాండ్ నేటితో ముగుస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఒకసారి చంద్రబాబుకు రిమాండ్ ఎసిబి కోర్టు పొడిగించింది. గత నెల 24 న వర్చువల్ గా ఎసిబి కోర్టులో చంద్రబాబును హాజరుపరిచారు జైలు అధికారులు. నేటితో రిమాండ్ గడువు ముగుస్తుండటంతో.. మరోసారి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా చంద్రబాబును హాజరు పరుచనున్నారు. ప్రస్తుతం బెయిలు పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు రిమాండ్ ను నేడు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: గిరిజనుల పాలిటి వరం “జగనన్న ఆరోగ్య సురక్ష: ఆరోగ్య మంత్రి విడుదల రజిని

కాగా ఎసిబి కోర్టులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో నిన్నంతా (బుధవారం) చంద్రబాబు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి. నేడు బెయిల్ ,కస్టడీ పిటిషన్ లపై చంద్రబాబు తరపు న్యాయవాదులు సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. నేడు బెయిల్ , కస్టడీ పిటిషన్లపై ఏసిబి కోర్టు తీర్పును వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

ఇది కూడా చదవండి: నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్‎లో దరఖాస్తులు ప్రారంభం..అర్హులు ఎవరంటే?

నేటితో రిమాండ్‌ పూర్తి?
ఇక చంద్రబాబు నాయుడి జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు ఎసిబి కోర్టు గతంలో పొడిగించింది. గత ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీ ముగియడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు సీఐడీ అధికారులు హాజరుపరిచారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. తొలుత సెప్టెంబర్‌ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. సీఐడీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా అని ఏసీబీ కోర్టు జడ్జి బి.హిమ బిందు చంద్రబాబును ప్రశ్నించారు. విచారణకు తాను సహకరించానని, సంబంధిత ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని చంద్రబాబు మేజిస్ట్రేట్ కు తెలిపారు. ఏ తప్పూ చేయకుండా తనను జైల్లో పెట్టారని చంద్రబాబు నాయుడు మరోసారి మేజిస్ట్రేట్ కు తెలిపారు. కోర్టు విధివిధానాలు పాటించాలని, ప్రస్తుతానికి ఇది కేవలం ఆరోపణ మాత్రమేనని, జ్యుడీషియల్ కస్టడీ అంటే శిక్ష కాదని మేజిస్ట్రేట్ చంద్రబాబుకు చెప్పారు. ఇక బెయిల్‌తో పాటు కస్టడి పిటిషన్‌ను విచారించిన కోర్టు నేడు మరోసారి విచారించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు