Chandrababu Naidu: అర్థరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు!

భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం అర్థరాత్రి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించారు.ముంపు ప్రాంతాల్లో బోటులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

New Update
Chandrababu Naidu: అర్థరాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు!

Chandrababu : ఏపీలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో సహాయ‌క చ‌ర్యల‌పై సీఎం చంద్ర‌బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రంతా విజ‌య‌వాడ‌లోని (Vijayawada) వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు అధికారుల‌తో క‌లిసి బోటులో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యంగా బుడ‌మేరు వ‌ర‌ద‌తో అస్త‌వ్య‌స్త‌మైన సింగ్ న‌గ‌ర్ (Singh Nagar) ప్రాంతంలో సీఎం చంద్ర‌బాబు ఆదివారం అర్ధ‌రాత్రి రెండోసారి ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం.

అర్ధరాత్రి 1.10 గంట‌ల‌కు కృష్ణ‌లంక‌లోని 16వ డివిజ‌న్ పోలీసు కాల‌నీలో ఆయన ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రక్ష‌ణ గోడ వ‌ద్ద వ‌ర‌ద నీటిని ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితి ఏర్పడుతుందని వ‌ర‌ద బాధితుల‌కు ధైర్యం చెప్పారు. అలాగే సింగ్ న‌గ‌ర్‌, కృష్ణలంక‌, ఫెర్రీ, ఇబ్ర‌హీంప‌ట్నం, జూపూడి, మూల‌పాడు ప్రాంతాల్లో వ‌ర‌ద ఉద్ధృతిని ప‌రిశీలించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెల్లవారుజామున మూడు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే చంద్రబాబు ఉన్నారు. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో జనం రోడ్లపైకి వచ్చారు. ఆ సమయంలో కూడా సీఎం వారి వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

వరద బాధితులందరికీ కూడా ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని చంద్రబాబు తెలిపారు. ఎవరూ అధైర్య పడొద్దు... అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని బాబు తెలిపారు.

బాధితుల‌ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబుపై పార్టీ శ్రేణులు, అభిమానుల‌తో పాటు ప‌లువురు సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చంద్ర‌బాబుతో వెంట ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు నారాయ‌ణ‌, కొల్లు ర‌వీంద్ర‌, అనిత‌, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గ‌ద్దే రామ్మోహ‌న్‌, కృష్ణ‌ప్ర‌సాద్‌, క‌లెక్ట‌ర్ సృజ‌న‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు అంతా కూడా ఉన్నారు.

Also Read: సినిమాల్లోనే కాదు.. పాలిటిక్స్ లోనూ ట్రెండ్ సెట్ చేసిన పవర్ స్టార్!

Advertisment
Advertisment
తాజా కథనాలు