Breaking: మాజీ సీఎం జగన్కు చంద్రబాబు ఫోన్! ఏపీ మాజీ సీఎం జగన్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రేపటి తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేందుకు ఫోన్ చేయగా.. చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇక కాసేపటి క్రితమే చంద్రబాబు గవర్నర్ను కలవగా ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆహ్వానించారు. By srinivas 11 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP News: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ వేడుక జరగనుండగా.. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, వెంకయ్య నాయుడు, యోగితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రేపటి తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేందుకు ప్రయత్నించగా.. చంద్రబాబు ఫోన్కు జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని అన్నారు. తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందని, అందుకే వారంతా చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని, వినయంగా ఉండాలని కూటమి శ్రేణులకు సూచించారు. ఇక సీఎంగా 12న ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను ఉదేశించి చేసినవేనా అన్న అనుమానం కలుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ శ్రేణులపై కూటమి శ్రేణులు దాడులను ఖండిస్తూనే చంద్రబాబు ఇలా వార్నింగ్ ఇవ్వడం దేనికి దారి తీస్తుందో చూడాలి. #chandrababu #jagan #ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి