Chandrababu and Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, పవన్ రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. By E. Chinni 15 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి ChandraBabu and Pawan Kalyan: రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అసమానతలు తొలగించి, పేదరికం రూపు మాపి తిరుగులేని శక్తి భారత్ ను తీర్చి దిద్దేందుకు స్పష్టమైన విజన్ తో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ (Janasena Party) ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు. జెండా ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతేకాకుండా భారత మాత నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. జాతీయ పతాకావిష్కరణ కోసం పార్టీ కార్యాలయ ప్రాంతాన్ని సర్వంగ సుందరంగా అలకరించారు. రంగు రంగుల పుష్పలతో వేడుకలు నిర్వహించిన ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా అలంకరణ ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జనసేన నాయకులు జెండా పండగను ఘనంగా నిర్వహించి.. స్వాతంత్య్ర సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. Also Read: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు #pawan-kalyan #chandrababu #andhrapradesh #independence-day #chandrababu-and-pawan-kalyan #chandrababu-independence-day-wishes #pawan-kalyan-independence-day-wishes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి