Lokesh Bailpetion: లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హై కోర్ట్ లో విచారణ! తెలుగు దేశం పార్టీ (Tdp) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh)లు ఏపీ హైకోర్టులో(Ap High court) ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. By Bhavana 29 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి తెలుగు దేశం పార్టీ (Tdp) అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh)లు ఏపీ హైకోర్టులో(Ap High court) ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ ను ఏ -14 గా చేరుస్తూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ కేసులో లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన తరుఫున న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం ఫస్ట్ అవర్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మరో వైపు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలెన్ మెంట్ కేసులో చంద్రబాబు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2.15 గంటలకు నిమిషాలకు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టులో విచారణ సాగనుంది. ఇప్పటికే ఇరు వర్గాల న్యాయవాదులు కూడా తమ వాదనలను కోర్టులో వినిపించారు. అంగళ్ల అల్లర్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ గురించి వాదనలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. తీర్పును రిజర్వ్ఏ పీ హైకోర్టుచేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Arrest) అరెస్ట్ తో నారా లోకేశ్(lokesh) యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. ఈ నెల 29 నుంచి మళ్లీ మొదలుపెట్టాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అయితే, లోకేశ్ తన పాదయాత్రను వాయిదా వేసుకోవాలని టీడీపీ నేతలు కోరారు. అక్టోబరు 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు వాదనలు ఉండడంతో, పాదయాత్రను మరో తేదీకి వాయిదా వేయాలని టీడీపీ నేతలు లోకేశ్ కు సూచించారు. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని, పాదయాత్రలో ఉంటే సంప్రదింపులు కష్టమవుతాయని, లోకేశ్ ఢిల్లీ(Delhi)లో ఉంటేనే మంచిదని వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. టీడీపీ నేతల అభిప్రాయాలతో నారా లోకేశ్ ఏకీభవించారు. యువగళం పాదయాత్ర తేదీని మరోసారి వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో నేతలతో చర్చించి పాదయాత్రకు మరో తేదీని ప్రకటించనున్నారు. మరోవైపు లోకేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ కేస్ లోకేష్ అరెస్ట్ అయితే అతనికి బదులు అదే ముహూర్తానికి ఆయన సతీమణి నారా బ్రాహ్మణి(Nara Brahmani) పాదయాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఆమెకు ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబసభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి కనిపిస్తోంది. ఇప్పటికి చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చేస్తునే ఉన్నారు. #nara-lokesh #tdp #high-court #ap #amaravathi #cbn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి