Lunar eclipse 2024: ఈ ఏడాది చంద్రగహణం ఎప్పుడంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం.. మార్చి 25న హోళీ పండుగ రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షికంగానే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం మార్చి 25న ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుందని వివరించారు. By Bhavana 21 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం.. మార్చి 25న హోళీ పండుగ రోజు ఏర్పడుతుంది. ఇది పాక్షికంగానే ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం మార్చి 25న ఉదయం 10.23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.02 గంటల వరకు ఉంటుందని వివరించారు. చంద్ర గ్రహణం సూతక్ కాలం గ్రహణ సమయానికి 9 గంటల ముందు మొదలవుతుంది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం భారత్ లో చెల్లదు.కాబట్టి హోలీ పండుగను పెద్దగా ప్రభావితం చేయదు. కాబట్టి హోలీ ను జరుపుకోవచ్చని పండితులు వివరిస్తున్నారు. తొలి చంద్ర గ్రహణం... ఐర్లాండ్, ఇంగ్లాండ్,హాలండ్, బెల్జియం, నార్వే, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ అమెరికా, జపాన్, రష్యా వంటి దేశాల్లో తొలి చంద్ర గ్రహణం కనిపించనుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరాలు లేకుండానే చూడొచ్చని నిపుణులు తెలియజేశారు. రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడనుంది. 2024లో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. Also read: పెద్ద కొడుకుని రక్షించబోయి.. చిన్న కొడుకుని చేజార్చుకున్నాడు! #bharat #lunar-eclipse-2024 #grahanam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి