Gujarath: గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం

గుజరాత్‌ లో చండీపురా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎనిమిది మంది చిన్నారులతో కలిపి ఇప్పటికి పధ్నాలుగు మంది ఈ వైరస్‌తో చనిపోయారు.

New Update
Gujarath: గుజరాత్‌లో చండీపురా వైరస్ కలకలం

Chandipura Virus: గుజరాత్‌లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ వైర్ బారిన పడుతున్నారు. ఈరోజు ఇద్దరు చిన్నారులు దీని కారణంగా మరణించారు. దీంతో గుజరాత్‌లో చండీపురా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 14కు చేరంది. ఇందులో ఎనిమిది మంది చిన్నారులే ఉన్నారు. సబర్‌కాంత, ఆరావళి, మహిాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్‌ జిల్లాల్లో చంీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

రాజస్థాన్ నుంచి రెండు కేసులు, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఒక కేసు గుజరాత్‌లోనే చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. రాజస్థాన్‌కి చెందిన ఇద్దరు రోగుల్లో ఒకరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ డిపార్ట్మెంట్‌ని హై అలర్ట్ చేశామని, చండీపురా వైరస్ కేసులను గుర్తించేందుకు కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు చెప్పారు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. దాంతోపాటూ
ముందుజాగ్రత్తగా 26 రెసిడెన్షియల్ జోన్లలోని 8600 ఇళ్లలో 44,000 మందికి పైగా స్క్రీనింగ్ నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. చండీపురా వైరస్ జ్వరాన్ని కలిగిస్తుంది, ఫ్లూ వంటి లక్షణాలతో తీవ్రమైన ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు)ని కలిగిస్తుంది. ఇది దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

Also Read:Andhra Pradesh: 2005 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకయ్యచౌదరి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment