Scrap: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం

ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను అమ్మడంతో కేంద్రానికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 2 నుంచి 31 వరకు చేపట్టిన మూడో విడత ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో ఈ ఆదాయం లభించినట్లు కేంద్ర పర్సనల్‌ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది.

New Update
Scrap: చెత్తను అమ్మి రూ.500 కోట్లు సంపాదించిన కేంద్రం

ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను విక్రయించడం ద్వారా కేంద్రానికి భారీ ఆదాయం వచ్చింది. దాదాపు 500 కోట్ల రూపాయలు చెత్త ద్వారా వచ్చినట్లు కేంద్ర పర్సనల్‌ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. కార్యాలయాల పరిశుభ్రతపై చేపట్టిన కార్యక్రమాలు ఇటీవల ముగిసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక 2021-2023 మధ్యకాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్త, పనికిరాని సామాగ్రిని అమ్మడంతో రూ.1100 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు మూడో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో రూ.500 కోట్ల ఆదాయం సమకూరింది.

Also read: ఎన్నికలకు ముందే అరెస్టులకు కుట్ర.. మమత బెనర్జీ సంచలన ఆరోపణలు

Also Read: ఎన్నికల్లో పోటీ చేయను.. కారణమిదేనన్న డీకే అరుణ..

ఇక ప్రత్యేక స్వచ్ఛ కార్యక్రమం మూడో విడత కింద 2.53 లక్షల ప్రాంతాల్లోని.. 154 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసి అందుబాటులోకి తెచ్చామని పర్సనల్ మినిస్ట్రీ పేర్కొంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని కేంద్రమంత్రి జితేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. గత ఏడాది దీనిని 1.01 లక్షల చోట్ల నిర్వహించగా.. ఈసారి మాత్రం 2.53 చోట్ల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతను భాగం చేయడంలో ఇది మరో అతిపెద్ద కార్యక్రమమని తెలిపారు.

Also Read: ఓరి మీ దుంపలు తెగ.. కారు ప్రమాదం జరిగితే.. మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు..

Also Read: హ్యాకింగ్ వ్యవహారంలో మరో ట్విస్టు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Advertisment
Advertisment
తాజా కథనాలు