Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్

ఒవైసీ రాక్షసంగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం జరిగిన వెంటనే చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఈ రోజు బండి సంజయ్ పరామర్శించారు.

New Update
Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్

Minister Bandi Sanjay: ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నం చేస్తే కనీసం స్పందించని ఒవైసీకి మహిళల మాన, ప్రాణాలకంటే ఒకవర్గం వాళ్ల ఫర్నీచర్, షాపులే ముఖ్యమైనట్లుగా మాట్లాడుతూ రాక్షసంగా వ్యవహరించడం సిగ్గు చేటు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై లైంగిక దాడి జరిగిన వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దాడులను అరికట్టాలనే నెపంతో హిందూ యువతపై అక్రమ కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆవాసీ మహిళను బండి సంజయ్ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులతో కలిసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళ ముఖం గుర్తుపట్టలేనంతగా దాడికి గురవడం చూసి సంజయ్ నిశ్చేష్టులయ్యారు.

గతనెల జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ(45)పై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి ఘటన సిగ్గు చేటు. ముఖం పూర్తిగా దెబ్బతిన్నది. నిర్భయ, దిశ సంఘటనల మాదిరిగా మహిళపై ఘోరంగా దాడి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరం. చస్తే సంతాపం, లేదంటే పరిహారం అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని బండి విమర్శించారు. ఆదివాసీ మహిళపై దాడి చేస్తే.. తిరిగి హిందువులపైనే దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు.

నిర్మల్ లో మున్సిపల్ ఛైర్మన్ మైనర్ బాలికపై అత్యాచారం చేసిండు. నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో ఏడాదిన్నర క్రితం మైనర్ బాలికపై ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుతోపాటు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు దారుణంగా అత్యాచారం చేసినా పట్టించుకోలేదు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అధికారికంగా వాడే కారులోనే రేప్ చేసినట్లు వార్తలొచ్చినా స్పందించరు. నిర్మల్ లో మైనర్ బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ సాజిద్ అత్యాచారం చేసి చంపుతామని బెదిరించినా మీడియాలో వార్తలొచ్చి జనం ఆందోళనలు చేసేదాకా పట్టించుకోరు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ బేగంబజార్ లో 13 ఏళ్ల మైనర్ బాలికపై ఎంఐఎం నాయకుడు రఫీక్ లైంగిక దాడి చేసినా ధర్నాలు, ఆందోళనలు చేసేదాకా అరెస్ట్ చేయరు... ఎంఐఎం గూండాలు అత్యాచారాలు చేస్తే పట్టించుకోరు. కాంగ్రెస్ పాలనలోనూ ఇవే కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలులో రైతు కూలీ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినా పట్టించుకోలేదు. ఇదే పరిస్థితులు నెలకొంటే మహిళలను కాపాడేదెవరు అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

ఆదివాసీ మహిళపై లైంగిక దాడి, హత్యాయత్నం జరిగితే ఖండించాల్సిన ఒవైసీ... అందుకు భిన్నంగా మాట్లాడటం సిగ్గు చేటు. ఒక వర్గం షాపులపై దాడులు జరుగుతున్నాయి. అరెస్టు చేయాలని చెప్పడం సిగ్గు చేటు. జూబ్లిహిల్స్ ఘటనలో జరిగిన లైంగిక దాడిపై నోరు విప్పడు. నిర్మల్ ఘటనపై నోరు విప్పడు.పోలీసులకు నేను చెప్పేదొక్కటే. హిందూ యువతపైన, ఆదివాసీలపైన అక్రమ కేసులు పెడితే గొడవలు ఆగే పరిస్థితి ఉండదు. వెంటనే దీనిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇదే విషయంపై డీజీపీతో మాట్లాడిన. గొడవలను ఆపాలనే నెపంతో ఒక వర్గానికి కొమ్ముకాస్తే మాత్రం ఆదివాసీ యువత కోపాన్ని చల్లార్చలేరు. ఇదే విషయంపై కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలివ్వాల్సిన అవసరం ఉందని బండి అన్నారు.

Also Read: Uttar Pradesh: తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే…

Advertisment
Advertisment
తాజా కథనాలు