BJP Jana garjana: డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్: అమిత్ షా

కేసీఆర్ ఒక్క హమీని కూడా నెరవేర్చలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ రోజు ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అమిత్‌ షా మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. నేటి తరం రజాకార్ల నుంచి తెలంగాణను రక్షించేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా అన్నారు.

New Update
Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా

డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జనగర్జన (BJP Janagarjana) బహిరంగ సభకు హాజరైన అమిత్‌ షా మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ (CM KCR) నెరవేర్చలేదన్నారు. నేటి తరం ఆధునిక రజాకార్ల నుంచి తెలంగాణను రక్షించేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా అన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఏనాడు పేదలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గిరిజనులకు మూడు ఎకరాలు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీకి పదేళ్లుగా కేసీఆర్ భూమి ఇవ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్ ఆదివాసీలకు కేసీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. పేద గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: చివరికి తెలంగాణ ఎలక్షన్స్.. బీజేపీకి అడ్వాంటేజ్?

దళితులందరికీ ఇస్తామన్న రూ.10 లక్షలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ ను అమిత్ షా ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఇచ్చారన్నారు. తెలంగాణను నంబర్ 1 గా చేశామని కేసీఆర్ ఎప్పుడూ గొప్పలు చెబుతాడన్నారు అమిత్ షా. కానీ.. కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ నంబర్.1 గా ఉందన్నారు. అవినీతిలోనూ తెలంగాన నంబర్.1 మారిందన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఎంఐ చేతిలో ఉందన్నారు. జీ-20 సదస్సులో ప్రపంచ దేశాలన్నీ మోదీని అభినందించాయన్నారు అమిత్ షా. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నా.. నడిపించేది మాత్రం ఎంఐఎం ఏనని అన్నారు అమిత్ షా.

కాంగ్రెస్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు అమిత్ షా. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నేతలు కొత్త దుస్తులు వేసుకుని వస్తారని తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కొడుకు, కూతురు కోసమే కేసీఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడిందన్నారు. బీజేపీని గెలిపించి కేసీఆర్ ను గద్దె దించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు అమిత్ షా.

Advertisment
Advertisment
తాజా కథనాలు