Bank Jobs 2024 : టెన్త్ అర్హతతో 484 బ్యాంక్ జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే! నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. పదో తరగతి అర్హతతో 484 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 21-27 వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 23 Jun 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Central Bank Of India Recruitment 2024 : నిరుద్యోగులకు (Un Employees) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థల్లో ఒకటైన CBI.. ఉద్యోగ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ మేరకు ముంబైలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్‌మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని తెలిపింది. మొత్తం పోస్టులు : 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ విద్యా అర్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి. వయసు : 2023 మార్చి 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: జూన్ 21 నుంచి 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు : రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. పరీక్ష తేదీ : 2024 జులై/ ఆగస్టు ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ కాలం : ఒక ఏడాది జీతం : రూ.19,500 – రూ.37,815 వరకు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ : https://nats.education.gov.in/ #un-employees #job-notification #central-bank-of-india #recruitment-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి