Census: బడ్జెట్‌లో జనగణనకు తక్కువ కేటాయింపులు.. ఈ ఏడాది కూడా జరగనట్లేనా ? 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. మూడేళ్ల క్రితం జనగణననకు రూ.3,768 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి బాగా తగ్గించింది. దీంతో ఈ ఏడాది కూడా జనగణన జరిగే అవకాశం లేకపోయింది. By B Aravind 23 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే బడ్జెట్‌లో జనగణన కోసం పరిమిత కేటాయింపులు మాత్రమ చేశారు. ఈ ఆర్థిక ఏడాదికి..జనగణన, జాతీయ జనాభా నమోదు (NPR) ప్రక్రియ కోసం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. అయితే 2021-2022లో జనగణననకు రూ.3,768 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి మాత్రం గణనీయంగా తగ్గించింది. 2023-24 బడ్జెట్‌లో జనాభా లెక్కలో కోసం కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే కేటాయింపు చేశారు. ఈసారి కాస్త పెంచినప్పటికీ కూడా జనగణన అంచనా ఖర్చు కంటే ఇది చాలా తక్కువ. Also Read: బడ్జెట్‌లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం.. ఐదేళ్ల క్రితమే జనాభా లెక్కలు, ఎన్‌పీఆర్ ప్రక్రియకు దాదాపు రూ.12 వేల కోట్లపైనే ఖర్చవుతుందని అంచనా వేసింది. 2019 డిసెంబర్‌లో అప్పటి కేంద్ర కేబినేట్.. 2021లో జనగణనను చేపట్టేందుకు రూ.8,754 కోట్లు కేటాయించాలని, జాతీయ జనాభా నమోదు(NPR)ను అప్‌డేట్ చేసేందుకు రూ.3,941 కోట్లు కేటాయించాలని ఆమోదం తెలిపింది. కానీ 2020లో కోవిడ్ వల్ల ఈ ప్రణాళిక ఆగిపోయింది. అప్పటినుంచి జనగణన, ఎన్పీఆర్‌ను కేంద్రం హోల్డ్‌లో పెట్టింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత అమిత్ షా ప్రకటన చేసినా కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. ఈ ఆర్థిక ఏడాది కూడా వీటికి తక్కువ బడ్జెట్ కేటాయించడంతో జనాభా లెక్కలు ఈ ఏడాది కూడా జరిగే అవకాశం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. Also read: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం! #telugu-news #npr #census మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి