ఫోన్ మైకంలో ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి.. వైరల్ అవుతున్న సజ్జనార్ వీడియో ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ రీసెంట్‌గా నెట్టింట పోస్ట్ చేసిన రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో సెల్ ఫోనే లోకం కాదు. రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే అతివేగం తెచ్చిన అనర్థం ఇది.. అంటూ తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందిన వీడియో పోస్ట్ చేశారు. By srinivas 13 Nov 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆర్‌టీసీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడూ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు, మానవ రవాణాకు సంబంధించిన జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. రోడ్లపై కొంతమంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకుంటున్న పలు ఘోరాలకు సంబంధించిన వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ అలర్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఆయన షేర్ చేసిన రెండు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సెల్ ఫోనే లోకం కాదు! రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి. pic.twitter.com/Q6ubnkmWmq — V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 6, 2023 ఈ మేరకు ‘సెల్ ఫోనే లోకం కాదు! రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా. లేదో గమనించాలి. ఫోన్ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి’ అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో ఓ మహిళా ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా ఓ అపరిచితుడు తన ఫోన్ లాగేసుకుని పరిగెత్తాడు. రోడ్డుపై వేగంగా వాహనాలు వస్తుండగా ఆమె దిక్కుతోచని పరిస్థితిలో అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఆ దొంగ రోడ్డు అవతలకు పరిగెత్తి పక్కనున్న గోడదూకి పోరిపోయాడు. కాగా ఈ వీడియోను సజ్జనార్ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలో వైరల్ అయింది. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. తమకు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ ఇలాంటి దుర్మార్గుల నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అతివేగం తెచ్చిన అనర్థం ఇది! గుజరాత్ లోని ఆనంద్ లో మూడు రోజుల క్రితం జరిగిందీ ఘోర ప్రమాదం. ఈ దుర్ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. @MORTHIndia #RoadAccident #OverSpeed #Road #Accident pic.twitter.com/ARF20kvPjx — V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 8, 2023 ఇదిలావుంటే.. కారు ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు తండ్రి దారుణంగా మరణించిన వీడియోను కూడా షేర్ చేశారు సజ్జనార్. ‘అతివేగం తెచ్చిన అనర్థం ఇది! గుజరాత్‌లోని ఆనంద్‌లో మూడు రోజుల క్రితం జరిగింది ఈ ఘోర ప్రమాదం. ఈ దుర్ఘటనలో బైక్‌పై వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయి’ అని ఈ వీడియో షేర్ చేస్తూ రాసుకొచ్చారు. కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా బైక్‌పై వస్తున్న ఓ కుటుంబాన్ని డీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలు వారి ఐదేళ్ల కుమార్తె ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ భయంకరమైన ఘటన చూసిన నెటిజన్లు కంగుతిన్నారు. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కొల్పోవడం బాధకరమని సానుభూతి చూపిస్తున్నారు. అతివేగం అనర్థదాయకమని ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతూ కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. #video #sajjanar #going-viral #cell-phone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి