Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్...

ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. 

New Update
Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్...

Election Schedule : ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలు(General Elections), వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మధ్యాహ్నం సీఈసీ ప్రెస్‌మీట్‌(EC Press Meet) పెట్టనుంది. ఈ ప్రెస్‌మీట్‌ అన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన ఈసీ తాజాగా జమ్ముకశ్మీర్ పర్యటనతో తన సర్వేను ముగించింది. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కు సంబంధించి బీజేపీ(BJP) ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్(Congress) రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక తాజాగా ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సంధు బాధ్యతలు స్వీకరించారు. 

Also Read : KTR: కవిత కేసులోకి చంద్రబాబును లాగిన కేటీఆర్.. ట్వీట్ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!

IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.

New Update

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్‌ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. 

దిగజారిన వ్యవస్థలు..

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.

(ys-jagan | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment