NEET Scam : నీట్ పరీక్ష అక్రమాలపై సీబీఐ కేసు నమోదు.. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సీబీఐకి శనివారం అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సీబీఐ దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. By B Aravind 23 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CBI Register FIR : నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు సీబీఐకి అప్పగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఈ పరీక్షలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆదివారం ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. Also Read: భూ సమస్యల పరిష్కారానికి త్వరలో కొత్త చట్టం.. ! కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ పనిని వారికి అప్పగించినట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత కోసం.. సమీక్ష చేసిన చేసిన తర్వాతే సీబీఐకి అప్పగించామని వెల్లడించారు. ఇదిలాఉండగా.. మే 5న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 24 లకల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల ఈ పరీక్ష పేపర్ లీకైందనే వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ కోసం రంగంలోకి దిగిన సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. Also Read: హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఉద్రిక్తత #telugu-news #cbi #neet-exam-2024 #fir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి