Venkatesh: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు! హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి. By Trinath 29 Jan 2024 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి Case Filed on Hero Venkatesh: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. వెంకటేష్, కుటుంబసభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతపై కేసు నమోదు చేయాలని చెప్పింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి.. ఫర్నిచర్ ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో వెంకటేశ్, సురేశ్‌బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదుకు ఆదేశించింది కోర్టు. IPC 448, 452, 380, 506, 120బీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో ఏముంది? లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు నందకుమార్. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్‌ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ ను ధ్వంసం చేశారన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేశ్, కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Also Read: టీమిండియాకు భారీ షాక్.. విశాఖ టెస్టుకు స్టార్ ప్లేయర్ ఔట్! WATCH: #rana-daggubati #venkatesh #nampally-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి