BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.

New Update
BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు

SIDDIPET : సంక్రాంతి పండుగపూట సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వేగంగా వెళ్తున్న కారు.. ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు ట్రే చేయగా అదుపు తప్పింది. దీంతో ఆ కారు నాలుగైదు పల్టీలు కొట్టిగా.. అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ఆ వేగానికి ఎగిరి బయటపడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్ర గాయలతో బయటపడగా..  యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఇక ఈ కారు బోల్తా పడినప్పుడు ముందుగా దంపతులు వెళ్తున్న బైక్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కాస్త బైక్ వేగం తగ్గిన వారిద్దిరూ దాదాపుగా చనిపోయే ప్రమాదంగానే వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి : Telangana: ప్రైవేటు బస్సులో భారీ చోరీ.. రూ.12.80 లక్షలు కొట్టేసిన దుండగులు..

వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సకోసం తరలించారు. అయితే వీరందరూ హుస్నాబాద్ కు చెందిన మైనర్ యువకులు కావడం గమనార్హం. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక విషయం తెలుసుకున్న యువకులు బంధువులు, కుటుంబ సభ్యులు హుస్నాబాద్ ఆస్పత్రికి చేరుకుని గుండులవిసేలా రోధించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.

New Update
PahalgamTerroristAttack

PahalgamTerroristAttack

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇద్దరు తెలుగు వాసులు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

Advertisment
Advertisment
Advertisment