Rohit Virat: అతను ఆడాల్సిందే! కోహ్లీకి అండగా రోహిత్.. బీసీసీఐకి వార్నింగ్! టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఎంపిక ఎపిసోడ్ నాటకీయ మలుపు తీసుకుంది. వెస్టిండీస్ పిచ్‌లకు కోహ్లీ సరిపోడని.. అతడిని పక్కన పెట్టాలని బీసీసీఐ భావిస్తుండగా.. కెప్టెన్ రోహిత్ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లీ ఆడాల్సిందేనని చెప్పాడు. By Trinath 17 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి టీ20 అయినా వన్డే అయినా కింగ్ మాత్రం కోహ్లీనే! పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో కోహ్లీ ఈ జనరేషన్ బెస్ట్ ప్లేయర్‌గా చెప్పవచ్చు. ఈ రెండు ఫార్మెట్లలో కోహ్లీ ఫెయిలైన సందర్భాలు చాలా చాలా తక్కువ. అయితే 2022 టీ20 వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భారత్ తరుఫున గతంలో లాగా టీ20ల్లో పాల్గొనడంలేదు. మొన్న(జనవరి) అఫ్ఘాన్‌తో సిరీస్‌లో ఆడారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఇక మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ క్యాష్ లీగ్‌లో పాల్గొనేందుకు కోహ్లీ లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. ఇటివలే అనుష్క-కోహ్లీ రెండో బిడ్డకు లండన్‌లో జన్మనిచ్చారు. ఇక ఇదే సమయంలో ఇంగ్లండ్ సిరీస్ జరగడంతో కోహ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అటు టీ20 వరల్డ్‌కప్‌లో కూడా కోహ్లీ ఆడడని నెట్టింట ఫుల్‌గా ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగింది? ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగుతున్నాయి. అక్కడి పిచ్‌లు కోహ్లీకి సూట్ అవ్వవని.. అందుకే అతడిని పక్కన పెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ బాధ్యతను సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌కు అప్పగించింది. నిజానికి రోహిత్, కోహ్లీ ఇద్దరూ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడలనుకుంటున్నారు. గతేడాది(2023) వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి ఈ ఇద్దరిని అందరికంటే ఎక్కువగా బాధించింది. ఎందుకంటే మరో వన్డే ప్రపంచకప్ వీరిద్దరు ఆడతారా లేదా అన్నది డౌటే. అందుకే టీ20 వరల్డ్‌కప్ గెలిచి 11ఏళ్లుగా భారత్‌ను వేధిస్తున్న ఐసీసీ ట్రోఫి ముచ్చట తీర్చాలని అనుకుంటున్నారు. అయితే బీసీసీఐ మాత్రం మరోలా ఆలోచిస్తోంది. కోహ్లీని టీ20 వరల్డ్‌కప్‌కు వద్దనుకుంటోంది. రోహిత్ అండ: మూడేళ్లగా ఫామ్ లేక ఇబ్బందులు పడ్డ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లీ పాల్గొనలేదు కానీ అతని ఫామ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అటు టీ20 వరల్డ్‌కప్‌ల్లో కోహ్లీకి అదిరిపోయే రికార్డు ఉంది. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ టాప్ రన్ గెటర్ కోహ్లీనే. అలాంటి కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్‌కప్ ఆడడం రోహిత్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని రోహిత్ బోర్డుకు ఇప్పటికే స్పష్టం చేశాడట.టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ అవసరం అని రోహిత్ చెప్పాడు. ఇక అక్టోబర్-నవంబర్ 2022లో జరిగిన టీ20 ప్రపంచ కప్ నుంచి రోహిత్ లాగానే కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఇద్దరు లేని సమయంలో రింకు సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. Also Read: వాళ్ళు పిచ్‌ను మార్చారు-మహ్మద్ కైఫ్ #virat-kohli #rohit-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి