కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..తప్పిన పెను ప్రమాదం..!! జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. By Bhoomi 11 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతానికి భారత్‌లోనే ఉండాల్సి వస్తోంది. జీ 20 సదస్సు అనంతరం ఆయన కెనడా బయలుదేరిని జస్టిన్ ట్రూడో..తాను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. జి 20 సదస్సులో పాల్గొనేందుకు తన కుమారుడు జేవియర్ తో కలిసి సెప్టెంబర్ 8న ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇది కూడా చదవండి: ఖైదీ నెంబర్ 7691…రాజమండ్రి జైలుకు టీడీపీ అధినేత..!! దీంతో అతను తన దేశానికి వెళ్లలేకపోయారు. వార్తా సంస్థ ANI ప్రకారం, విమానం మరమ్మతులు చేసే వరకు కెనడా ప్రతినిధి బృందం భారతదేశంలోనే ఉంటుంది. సమాచారం ప్రకారం, ప్రధాని తన హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరబోతున్నప్పుడు, తన విమానం కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇప్పుడు విమానం మరమ్మతులు చేసే వరకు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు కెనడా ప్రతినిధి బృందం భారతదేశంలోనే ఉండనుంది. Canadian Prime Minister’s plane suffers technical snag. The Canadian delegation will stay in India till the engineering team on the ground rectifies the issue: Airport Official tells ANI pic.twitter.com/42mgwuraa2— ANI (@ANI) September 10, 2023 అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్, కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ఇరు దేశాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ మద్దతుదారులు, భారతదేశానికి వ్యతిరేకంగా వారి కుట్ర గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ కార్యకలాపాలను ఆపివేయాలని, భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనలను ఆపాలని భారతదేశం బ్రిటిష్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను కూడా డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సీరియస్‌గా తీసుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ప్రధాని మోదీ మాటలు విన్నారు. అయితే ఈ విషయంలో ఆయన డిఫెన్స్‌గా కనిపించారు. ఖలిస్తానీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రిషి సునక్ భారత్‌కు హామీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: థానేలో భారీ ప్రమాదం..కుప్పకూలిన లిఫ్ట్…ఆరుగురు కార్మికులు మృతి…!! #canada #justin-trudeau #g20-summit #g-20 #g20-summit-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి