PM Modi : ప్రధానులు ఆర్మీ డ్రెస్‌ వేసుకోవడం కరెక్టేనా ?

ప్రధాని మోదీని ఆర్మీ డ్రెస్‌లో కనిపించడం చాలాసార్లు చూసే ఉంటాం. ఆర్మీ డ్రెస్‌ను పదేపదే వాడుకోవడం.. వాటితో ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతుంది. ఇంతకీ రూల్స్‌ ప్రకారం మోదీ చెస్తుంది కరెక్టేనా అనేది ఈ పూర్తి కథనంలో చదవండి.

New Update
PM Modi : ప్రధానులు ఆర్మీ డ్రెస్‌ వేసుకోవడం కరెక్టేనా ?

Army Camp : హాయ్‌.. మీరు ప్రధాని మోదీ(PM Modi) ని ఆర్మీ డ్రెస్‌(Army Dress) లో ఎన్నిసార్లు చూశారు? ఆర్మీ క్యాప్‌ పెట్టుకోని మోదీ మీకు ఎన్నిసార్లు కనిపించారు? అసలు ప్రధానులు ఇలా ఆర్మీ డ్రెస్‌లో కనిపించవచ్చా? అటు కాంగ్రెస్‌(Congress) అయితే ఇలా ఆర్మీ డ్రెస్‌ను పదేపదే వాడుకోవడం.. వాటితో ఎన్నికల ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతోంది. ఇంతకీ రూల్స్‌ ప్రకారం మోదీ చెస్తుంది కరెక్టేనా? ఇవాళ ఈ ఆసక్తికరమైన అంశాన్ని మీకు వివరించబోతున్నాం. 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) మొదటి దశకు కౌంట్‌డోన్‌ మొదలైంది. ఒకవైపు మోదీ ఎన్నికల ర్యాలీల్లో దూసుకుపోతున్నారు. బహిరంగ సభల్లో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇక గత నెల 16 నుంచి దేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రధాని మోదీపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. మోదీ తరచూ ఆర్మీ క్యాప్ ధరించి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది.

Also read: ప్రధాని మోదీపై పోటీ చేయనున్న ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌

ఆర్మీ డ్రెస్‌లో మోదీ 

నిజానికి మోదీ చాలా సందర్భాలలో ఆర్మీ డ్రెస్‌లో కనిపించారు. దీనిపై కాంగ్రెస్ చాలాసార్లు ప్రశ్నలు సంధించింది. 2020లో జైసల్మేర్‌లోని సైనికులతో దీపావళి జరుపుకోవడానికి మోదీ సైనిక దుస్తులు ధరించి వచ్చారు. సైనిక దుస్తుల్లో ఉన్న మోదీ ఫొటోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్‌ అయ్యాయి. ఆ సమయంలో కూడా మోదీ ఆర్మీ యూనిఫాం ధరించడాన్ని ప్రతిపక్షాలు తప్పబట్టాయి. సాయుధ బలగాలు లేదా పారా మిలిటరీ బలగాల యూనిఫాం ధరించడానికి ఏ చట్టం అనుమతిస్తుందనే ప్రశ్నలను కొందరు లేవనెత్తారు. 2022లో ప్రయాగ్‌రాజ్ జిల్లా కోర్టు మోదీకి వ్యతిరేకంగా దాఖలైన మానిటరింగ్ పిటిషన్‌పై PMOకి నోటీసు పంపింది.

వారికి మాత్రమే అర్హత

మోదీ యూనిఫాం ధరించారని, ఇది ఐపీసీ సెక్షన్ 140 ప్రకారం శిక్షార్హమైన నేరమని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, అధికారులు, సైనికులు తప్ప ఎవరూ ఆర్మీ డ్రెస్‌ ధరించరాదని బ్రిగేడియర్ స్థాయి అధికారులు చెబుతున్నారు. నిజానికి మోదీ ధరించే వార్ యూనిఫామ్‌పై ఎలాంటి స్టార్‌ లేదా గుర్తు ఉండదు. ఆయన ధరించే టోపీపై మాత్రం ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా, దేశాధినేతలు ఆర్మీ యూనిఫాం ధరిస్తారు. చాలా సందర్భాలలో, అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు కూడా సైనిక దుస్తులు ధరించి కనిపించారు. ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్మీ చీఫ్ జేజే సింగ్‌తో కలిసి ఆర్మీ యూనిఫాం ధరించి కనిపించారు కూడా.

Also Read:  మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు!

నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లను పోలి ఉండే యూనిఫారాలు అక్రమంగా ధరించిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 140, 171 కింద కేసులు నమోదు చేయవచ్చు. IPC సెక్షన్ 140 ప్రకారం ఎవరైనా నేవీ, ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ దుస్తులు ధరించి లేదా దాని చిహ్నాన్ని ఉపయోగించినట్లయితే వారికి మూడు నెలల జైలు శిక్ష పడుతుంది. అయితే రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రికి ఈ చట్టం వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే కాబోలు మోదీ ఎక్కువగా ఆర్మీ డ్రెస్‌లోనే కనిపిస్తుంటారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు