Buttermilk: మజ్జిగ మంచిదే అయినా ఈ వ్యాధులు ఉంటే అస్సలు తాగొద్దు శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో మజ్జిగ ఒకటి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, మినరల్స్ జీర్ణవ్యవస్థ,రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యతో బాధపడుతుంటే మజ్జిగ తాగపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 14 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Buttermilk: శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలలో మజ్జిగ ఒకటి. నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలతో పాటు వేసవిలో మన శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి అనేక రకాల డ్రింక్స్ తాగుతుంటాం. అందులో ప్రధానమైనది మజ్జిగ. పెరుగుతో చేసిన మజ్జిగలో అనేక పోషకాలు ఉన్నాయి. కానీ చాలా అరుదుగా ఇది కొంతమందిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మజ్జిగలో పోషకాలు: మజ్జిగ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, మినరల్స్ ఉంటాయి. దీనిలోని ప్రోబయోటిక్ లాక్టిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును బలంగా మారుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇది ముఖం ముడుతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జలుబు, దగ్గు ఉంటే మజ్జిగ తీసుకోవద్దు: జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యతో బాధపడుతుంటే మజ్జిగ తాగపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. రాత్రి పూట మజ్జిగ తాగితే దగ్గు తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు. కిడ్నీ డిజార్డర్: కిడ్నీ, ఎగ్జిమా సంబంధిత సమస్యలతో బాధపడేవారు మజ్జిగ తాగడం మానుకోవాలి. ఎగ్జిమా ఉన్నవారు కూడా మజ్జిగ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్న రోగులకు ఇది మంచిది కాదని చెబుతున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు మజ్జిగ తాగవచ్చా? కీళ్ల నొప్పులు ఉన్నవారు మజ్జిగకు దూరంగా ఉండాలి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు ఉన్నవారు మజ్జిగను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కీళ్లు పట్టేస్తాయని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు: మజ్జిగ అనేది సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారిలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇప్పటికే శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. జ్వరం వచ్చినప్పుడు మజ్జిగ తాగవచ్చా? జ్వరం వచ్చినప్పుడు మజ్జిగ తీసుకోకూడదు. మజ్జిగ చల్లదనాన్నిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పుల్లని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ స్థితిలో మజ్జిగ తాగడం మరింత హానికరం. అలర్జీ బాధితులు రాత్రిపూట మజ్జిగ తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కిచెన్‌లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా?..ఈ ముప్పు తప్పదు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #buttermilk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి