UP kidnap: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్... కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు

యూపీ ఘజియాబాద్‌లో ఓ బిజినెస్‌ మ్యాన్‌ కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. సొంత స్నేహితుడినే బంధించి, బెదిరించి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఓ కిలాడి దంపతులు. సీన్‌ కట్‌ చేస్తే ఆ ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.

New Update
UP kidnap: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్... కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు

ఢిల్లీ జనక్‌పురిలోకి చెందిన శశాంక్‌ శర్మకు సహరన్‌పూర్‌ (Saharanpur)లో టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీ ( textile factory) ఉంది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగేవి. దీంతో వాటిపై అతని ఫ్రెండ్‌ ఇషాంత్‌ త్యాగి దంపతులు కన్నేశారు. ఎలాగైనా అతని నుంచి పెద్ద మొత్తంలో డబ్బు రాబట్టాలని ప్లాన్‌ వేశారు. అక్టోబర్‌ 14న వ్యాపారం పేరుతో ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌కు పిలిపించారు. రాజ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లోని జ్యోతి విల్లా సొసైటీలోని తమ ఇంటికొచ్చిన శశాంక్‌శర్మను.. అప్పటికే అక్కడున్న తమ ఫ్రెండ్స్‌తో కలిసి గదిలో బంధించారు.

కొట్టి చిత్రహింసలు పెట్టారు

పాయింట్‌ బ్లాంక్‌లో గన్ను పెట్టి చంపేస్తామని బెదిరించి రూ.6 కోట్లు డిమాండ్‌ చేశారు. 6 గంటల పాటు అతన్ని కొట్టి చిత్రహింసలు పెట్టారు. ప్రాణభయంతో భార్య, ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి తనకు అర్జెంట్‌గా రూ.6 కోట్లు కావాలని అడిగాడు ఆ వ్యాపారి. ఐతే వారు 2 కోట్ల 75 లక్షల రూపాయలు ఏర్పాటు చేశారు. మిగిలిన మొత్తానికీ చెక్కులిచ్చాడు. శశాంక్‌ శర్మ (Shashank Sharma) ఇచ్చిన డబ్బులు, చెక్కులు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. ఆ తర్వాత బయటికొచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చదవండి: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు

ఐతే ఇషాంత్‌ త్యాగికి నేర చరిత్ర ఉంది. అక్టోబర్‌ 18న మరో హత్యాయత్నం కేసులో ఇషాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక తనను బంధించి కోట్ల రూపాయలు దోపిడీ చేశారన్న శశాంక్‌ శర్మ (Shashank Sharma) ఫిర్యాదుతో కేసు నమోదు (case Registration) చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నెల 21న ఓ స్కార్పియోను ఆపి తనిఖీలు చేస్తుండగా నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారి నుంచి 2 కోట్ల 25 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: పండుగపూట విషాదం..అల్లుడిని, కూతురిని తీసుకొస్తూ మృత్యువాత

Advertisment
Advertisment
తాజా కథనాలు