🔴 UNION BUDGET 2025 LIVE UPDATES: రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్.. బడ్జెట్ లైవ్ అప్డేట్స్!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ లేదని ప్రకటించారు. బడ్జెట్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.

author-image
By Nikhil
New Update
Union Budget 2025 Live Updates Nirmala Seetharaman Speech

Union Budget 2025 Live Updates Nirmala Seetharaman Speech

🔴 UNION BUDGET 2025 LIVE UPDATES: 

 

  • Feb 01, 2025 19:47 IST

    బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట.. ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా ?

    కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఢిల్లీ ప్రజలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు, గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా వంటి ప్రకటనలు అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Budget
    Budget

     



  • Feb 01, 2025 19:17 IST

    బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు!

    బంగారు ఆభరణాలపై 2025 బడ్జెట్‌లో కేంద్రం టారిఫ్ డ్యూటీ 5 శాతం తగ్గించింది. గోల్డ్ ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. ఇక బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శనివారం BSEలో గోల్డ్ స్టాక్స్ 9 శాతానికి పైగా లాభపడి గోల్డ్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

    gold rates
    gold rates Photograph: (gold rates)

     



  • Feb 01, 2025 19:17 IST

    బడ్జెట్‌పై తొలిసారిగా స్పందించిన నిర్మలా సీతారామన్

    కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదని బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారం నుంచి ఊరట లభించిందని నిర్మలా సీతారామన్ అన్నారు.

    Nirmala Sitharaman
    Nirmala Sitharaman

     



  • Feb 01, 2025 18:39 IST

    2025 బడ్జెట్‌లో పొరుగుదేశాలకు ఇండియా ఆర్థిక సాయం.. ఏ దేశానికి ఎంతంటే?

    2025 బడ్జెట్ కేటాయింపులో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. విదేశీ దేశాలకు ఆర్థిక సహాయంగా రూ.5,483 కోట్లు ప్రకటించారు. భూటాన్, మాల్దీవులు, ఆఫ్గనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్, మయన్మార్‌, శ్రీలంక దేశాలకు ఇండియా సాయం చేస్తోంది.

    india helping
    india helping Photograph: (india helping )

     



  • Feb 01, 2025 18:38 IST

    నేటి బడ్జెట్ తో ఆ విషయం తేలిపోయింది.. KTR సంచలన వ్యాఖ్యలు!

    జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని కేటీఆర్ అన్నారు. BJP, కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంపీలు బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది '0' అని అన్నారు. కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి తేలిపోయిందన్నారు.

    Union Budget 2025
    Union Budget 2025 KTR Reaction

     



  • Feb 01, 2025 17:54 IST

    కేటీఆర్, మంత్రులు బీజేపీకి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్



  • Feb 01, 2025 17:28 IST

    ‘బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్‌లా’ 2025 బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు

    2025 బడ్జెట్ పై రాహుల్ గాంధీ విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు బుల్లెట్‌ గాయాలకు బ్యాండ్‌ ఎయిడ్‌ వేసినట్టుగా ఉందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఎక్స్ వేదికగా ఆయన బడ్జెట్‌ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.

    budget 2025 522
    budget 2025 522 Photograph: (budget 2025 522)

     



  • Feb 01, 2025 16:39 IST

    కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

    కేంద్ర బడ్జెట్‌ ను సీఎం చంద్రబాబు స్వాగతించారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామని అభిప్రాయపడ్దారు.  మోదీ వికసిత్‌ భారత్‌ దార్శనికతను బడ్జెట్‌ ప్రతిబింబిస్తోందన్నారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్‌ గుర్తించిందన్నారు.

    chandrababu naidu
    chandrababu naidu Photograph: (chandrababu naidu)

     



  • Feb 01, 2025 16:22 IST

    వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్

    కేంద్రం పార్లమెంట్లో 2025 బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయం, తయారీ రంగాలకు ఆర్థిక శాఖ పెద్ద పీట వేసింది. ఆయా రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. మేక్ ఇన్ ఇండియా, అగ్నికల్చర్ లో ఉత్పదకత పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.

    agricultur india budget 2025
    agricultur india budget 2025 Photograph: (agricultur india budget 2025)

     



  • Feb 01, 2025 16:13 IST

    ఏమిటీ మఖానా... నిర్మలా సీతారామన్ ప్రకటించిన బోర్డు ఎందుకు?

    బీహార్ లో ముఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మఖానా బోర్డు ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయని ఆమె తెలిపారు.  దీనికింద రైతులకు శిక్షణ అందుతుందని వెల్లడించారు.

    Nirmala Sitharaman announces Makhana Board
    Nirmala Sitharaman announces Makhana Board Photograph: (Nirmala Sitharaman announces Makhana Board)

     



  • Feb 01, 2025 16:03 IST

    ఇంత అన్యాయమా?: కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ఫైర్!

    కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ రోజు ఆర్థిక శాఖ అధికారులతో కేంద్ర బడ్జెట్ పై సమీక్ష నిర్వహించారు.

    Union Budget 2024
    Union Budget 2024

     



  • Feb 01, 2025 16:03 IST

    అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ దీవులకు కేంద్రం గుడ్‌న్యూస్

    ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మత్స్య సంపద గురించి మాట్లాడారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లో మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందన్నారు.

    Nirmala Sitharaman
    Nirmala Sitharaman

     



  • Feb 01, 2025 15:26 IST

    PM Narendra Modi Tweet



  • Feb 01, 2025 15:17 IST

    వందకు వంద శాతం ఇది దేశాభివృద్ధి బడ్జెట్ : ప్రధాని మోదీ

    ఫైనాన్షియల్ ఈయర్ 2025 బడ్జెట్‌పై శనివారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ బడ్జెట్‌లో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ అన్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని.. నూటికి నూరు శాతం ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

    modi on budget
    modi on budget Photograph: (modi on budget)

     



  • Feb 01, 2025 15:12 IST

    కేంద్ర బడ్జెట్ పై సీఎం రేవంత్ అసంతృప్తి.. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపణ



  • Feb 01, 2025 15:11 IST

    ఉడాన్ స్కీమ్‌తో 4 కోట్ల మందికి లబ్ధి.. అసలు ఈ స్కీమ్ ఏంటో తెలుసా?

    మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరేందకు ఉడాన్ పథకాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే పదేళ్లలోొ 4 కోట్ల మంది ప్రజలకు చేకూరనుంది. ఈ పథకం ద్వారా మొత్తం 120 కొత్త కనెక్టివిటీలను పెంచనున్నారు.

    Nirmala Sitharaman
    Nirmala Sitharaman

     



  • Feb 01, 2025 15:09 IST

    కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు కేటాయింపులివే!

    ఏపీలోని పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3,295 కోట్లు కేటాయించారు.

    Budget in ap
    Budget in ap Photograph: (Budget in ap)

     



  • Feb 01, 2025 15:08 IST

    కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!

    కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయం ఉంటే రూ.80,000 ఆదా అవుతుంది.  పాత పన్ను స్లాబ్ ప్రకారం, ఒక వ్యక్తి జీతం రూ. 12 లక్షలు అయితే, దానిపై రూ. 80,000 పన్ను చెల్లించాలి, కానీ పన్ను స్లాబ్‌లో తాజా మార్పు తర్వాత ఇప్పుడది సున్నాగా మారింది.

    slabs new
    slabs new Photograph: (slabs new)

     



  • Feb 01, 2025 15:07 IST

    నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్.. నాన్‌స్టాప్ గంటా 14 నిమిషాల స్పీచ్

    బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గంటా 14 నిమిషాలసేపు నాన్‌స్టాప్ మాట్లాడారు. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సెషన్‌కు ఆమె 2 గంటల 40 నిమిషాలు పద్దుల ప్రసంగం ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈమెదే ఎక్కువ టైం బడ్జెట్ ప్రసంగం.

    Nirmala Sitharaman
    Nirmala Sitharaman

     



  • Feb 01, 2025 14:45 IST

    కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు తీరని అన్యాయం-టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్



  • Feb 01, 2025 12:53 IST

    ఇంజిన్లు ఎక్కువై 'బడ్జెట్ 'రైలు పట్టాలు తప్పింది: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్

    • వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులను అభివృద్ధికి నాలుగు ఇంజిన్లుగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 
    • ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. 'బడ్జెట్' రైలు అనేక ఇంజిన్లు ఉండటం వల్ల  పట్టాలు తప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేసారు.



  • Feb 01, 2025 12:37 IST

    UNION BUDGET 2025: బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్!

    బడ్జెట్‌ ముందు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు..అది ప్రారంభం అయిన తర్వాత నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోయింది. మరోవైపు నిఫ్టీ కూడా 135 పాయింట్లు డౌన్ అయింది. 

    stock market news
    stock market news

     



  • Feb 01, 2025 12:34 IST

    బడ్జెట్‌లో ప్రధాన ప్రకటనలు ఇవే:


    • ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గూడ్ న్యూస్ 
    • కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు
    • వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ లో సడలింపు
    • 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు
    • బీమా రంగంలో ఎఫ్ డీఐ 100% వరకు పెంచడం
    • వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టడం
    • గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సౌకర్యం
    • కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం



  • Feb 01, 2025 12:31 IST

    రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు


    • కొత్త పన్ను విధానంలో ఇది వర్తిస్తుంది
    • స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపితే రూ.12.75 లక్షల వరకు పన్ను రహితం



  • Feb 01, 2025 12:29 IST

    ముగిసిన బడ్జెట్ ప్రసంగం



  • Feb 01, 2025 12:13 IST

    Union Budget 2025 : 36 మెడిసిన్స్కు పూర్తిగా పన్ను రద్దు .. నిర్మలమ్మ సంచలన ప్రకటన

    మనుషుల ప్రాణాలను రక్షించే 36 మందులపై విధించే పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు నిర్మిస్తామని.. క్యాన్సర్ చికిత్సకు మందులు చౌకగా లభిస్తాయన్నారు.

    medicine
    medicine Photograph: (medicine )

     



  • Feb 01, 2025 12:12 IST

    UNION BUDGET 2025: AIకి పెద్ద పీట.. భారీగా కేటాయింపులు

    దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలను నెలకొల్పేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఏఐ కేంద్రాల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏఐ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    Budget 2025 Live



  • Feb 01, 2025 12:11 IST

    Income Tax : ఆదాయపు పన్ను బిల్లుపై నిర్మలమ్మ కీలక ప్రకటన

    ఆదాయపు పన్ను నిబంధనలలో త్వరలో పెద్ద మార్పు రానుంది. వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు. దీనిలో ఏదోరకంగా ఊరట లభిస్తుందని వేతనజీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

    income tax
    income tax Photograph: (income tax)

     



  • Feb 01, 2025 12:09 IST

    ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

    మెడికల్ టూరిజం అభివృద్ధికి వీసా నిబంధనలు సులభతరం 



  • Feb 01, 2025 12:08 IST

    36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు



  • Feb 01, 2025 12:07 IST

    కృత్రిమ మేధ అభివృద్ధి కోసం రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాల స్థాపన



  • Feb 01, 2025 12:05 IST

    జల్ జీవన్ మిషన్ కోసం అదనపు నిధులు

    • ఈ పథకం ద్వారా 15 కోట్ల మందికి శుభ్రమైన మంచినీరు అందించాము
    • రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100% మంచినీటి కుళాయిలు ఏర్పాటు



  • Feb 01, 2025 11:47 IST

    ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్గా పెట్టుబడుల ప్రోత్సాహం


    • క్లీన్స్టిక్ మిషన్ ద్వారా సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
    • పరిశ్రమల అభివృద్ధికి నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్ కార్యాచరణ



  • Feb 01, 2025 11:45 IST

    కొత్త ఉడాన్ పథకం

    • అదనంగా 120 రూట్లలో అమలు
    • 10 సంవత్సరాలలో 4 కోట్ల మంది ప్రయాణికులకు విమాన ప్రయాణం అందించడమే లక్ష్యం
    • బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఆమోదం



  • Feb 01, 2025 11:37 IST

    రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణాలు


    • మూలధన ఖర్చుల కోసం
    • 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలు
    • సంస్కరణలు అమలు చేయిస్తే ప్రోత్సాహకాలు



  • Feb 01, 2025 11:35 IST

    గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సౌకర్యం


    • గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
    • ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు
    • పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా అందుబాటులో
    • కోటి మంది గిగ్ వర్కర్లకు లాభం



  • Feb 01, 2025 11:33 IST

    ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక వరాలు..

    • ఎంఎస్ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు.
    • స్టార్టప్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు.
    • బొమ్మల తయారీకి ప్రత్యేకంగా ఒక పథకం



  • Feb 01, 2025 11:29 IST

    గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి: నిర్మల

    • ప్రపంచంలో ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, భారత్ మంచి పనితీరు చూపించింది.
    • త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ 



  • Feb 01, 2025 11:27 IST

    UNION BUDGET 2025: బడ్జెట్ తర్వాత భారీగా పెరగనున్న జీతాలు!

    బడ్జెట్ 2025 తర్వాత ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీని ముందు ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో దీర్థకాలిక స్థిరత్వం కోసం మూలధనం, శ్రమ మధ్య సహేతుకమైన పంపిణీ జరగాలని చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. 

    budget
    salary Hike After Budget 2025?

     



  • Feb 01, 2025 11:20 IST

    Union Budget 2025: రైతులకు బడ్జెట్లో వరాల జల్లు.. ధన్ ధాన్య యోజన స్కీమ్.. 1.7 కోట్ల మందికి బెనిఫిట్

    బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనుంది. 

    india
    Finance Minister Nirmala Sitaraman

     



  • Feb 01, 2025 11:19 IST

    పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం..

    • బిహార్‌లో మఖానా బోర్డు స్థాపన
    • కంది, మినుములు, మసూర్లను కేంద్రం కొనుగోలు చేయనుంది
    • పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం



  • Feb 01, 2025 11:16 IST

    ధన్ ధాన్య యోజన కార్యక్రమం...

    • దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం 
    • గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన 
    • 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి



  • Feb 01, 2025 11:10 IST

    ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి



  • Feb 01, 2025 11:07 IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురజాడ పద్యం  

    దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించిన నిర్మల



  • Feb 01, 2025 11:05 IST

    కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రారంభం



  • Feb 01, 2025 10:57 IST

    పేద రైతులు, మహిళలు, యువత ఆకాంక్షల బడ్జెట్ ఇది



  • Feb 01, 2025 10:57 IST

    ఈ బడ్జెట్ సామాన్యుల కోసమే .. మంత్రివర్గ సమావేశంలో మోదీ



  • Feb 01, 2025 10:49 IST

    లోక్ సభకు చేరుకున్న ప్రధాని మోదీ



  • Feb 01, 2025 10:42 IST

    Stock Market: ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్..బడ్జెట్ ప్రభావం

    బడ్జెట్ సమర్పణకు ముందు ఈ రోజు అంటే  స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 77,710 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్ల లాభంతో 23,560 వద్ద ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం నుంచి మార్కెట్ అటుఇటుగా ఊగిసలాడుతోంది. 

    stock market
    stock market

     



  • Feb 01, 2025 10:38 IST

    పార్లమెంటుకు చేరుకున్న అమిత్ షా



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు