శ్రీవారి భక్తులకు కీలక సూచన.. సాయంత్రం 6 గంటలకు ఈ మంత్రం పఠించాలన్న టీటీడీ!

తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని టీటీడీ సూచించింది. ధీపారాధన సమయంలో 'క్షమ మంత్రం' చదవి స్వామివారి దివ్యానుగ్రహం పొందాలని పండితులు తెలిపారు.  

New Update
drdr

Tirupati: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక పిలుపునిచ్చింది. తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు భక్తులంతా ఇళ్లలో ధీపారాధన చేయాలని సూచించింది. ఈ మేరకు భక్తులంతా ధీపారాధన సమయంలో 'క్షమ మంత్రం' చదవాలని పండితులు సూచించారు. 'ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..' మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలని చెప్పారు. 

'ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది. శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ "క్షమ మంత్రం" పఠించగలరు' అని టీటీడీ పోస్ట్ పెట్టింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు