Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 దగ్గర ట్రేడ్ అవుతోంది.

New Update
Stock Market,

ఈ రోజు దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే.. దేశీయ సూచీలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. సెన్సెక్స్ 353 పాయింట్ల లాభంతో 81,577.88, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,915 దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ రోజు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే.. 84.06గా ట్రేడ్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

లాభాల్లో ఈ షేర్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లో హెచ్‌డీఎఫ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మహీంద్రా గ్రూప్ కంపెనీ గత ఏడాది కాలంతో పోల్చుకుంటే రూ.493.9 కోట్ల నికర లాభాన్ని పొందింది. 3 శాతానికి పైగా లాభాల్లో మహీంద్రా షేర్లు ట్రేడ్ అవుతున్నాయి.  

ఇది కూడా చూడండి: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?

కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యునిలివర్, టాటా కన్స్యూమర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఫ్రంట్‌లో ఆర్థిక వ్యవస్థను పునరద్ధరించడానికి గత నెలలో చైనా రుణ రేట్లను తగ్గించింది. గత వారంతో పోలిస్తే ఈ వారం 7 శాతం కంటే తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 2024తో ముగిసిన రెండవ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్వల్పంగా 3% పెరిగి నికర లాభం రూ.689 కోట్లకు చేరుకుంది.

ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

ఈ వారంలో హ్యుందాయ్‌ మోటార్‌ ఐపీఓ లిస్టింగ్‌కు రానుంది. ఈ కంపెనీ రూ.27,870 కోట్ల ఐపీఓకు 2.37 రెట్ల స్పందన లభించింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ₹15,976 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసికంలో కొన్ని లాభాలను ఆర్జిస్తే.. మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు