Snap Layoffs: స్నాప్‌చాట్ సంచలన నిర్ణయం: 20 శాతం మంది ఉద్యోగులపై వేటు!

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది.

New Update
snap chat

ప్రముఖ సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్(snap chat) మాతృసంస్థ స్నాప్ ఇంక్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం పనితీరులో 15 నుండి 20 శాతం మేర ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ భారీ లేఆఫ్స్(Snap Layoffs) కారణంగా కొన్ని విభాగాల్లో సిబ్బంది సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని సమాచారం.

ఈ తొలగింపులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు కారణమనేది స్పష్టంగా తెలియనప్పటికీ, కంపెనీ తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం స్నాప్ ఇంక్ తన పూర్తి దృష్టిని AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) స్మార్ట్ గ్లాసెస్ అభివృద్ధిపై పెట్టింది. ఇందుకోసం స్పెక్స్ అనే విభాగాన్ని ప్రత్యేక విభాగంగా మార్చి, అక్కడ కొత్తగా నియామకాలు చేపడుతోంది. మెటా గ్లాసెస్‌తో పోటీ పడటమే లక్ష్యంగా స్నాప్ ఈ అడుగులు వేస్తోంది.

Also Read :  ఎయిర్ ఇండియాకు భారీ షాక్: రూ. 22 వేల కోట్ల నష్టం

కంపెనీకి మంచి ఆదాయం

మరోవైపు, స్నాప్‌చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా కంపెనీకి మంచి ఆదాయం లభిస్తోంది. ఇప్పటికే దీనికి 2.5 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయినప్పటికీ, గత త్రైమాసికంలో వృద్ధి మందగించడంతో కంపెనీ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే, ప్రముఖ ఏఐ సంస్థ పెర్ప్లెక్సిటీతో కుదుర్చుకున్న 400 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కూడా స్నాప్ రద్దు చేసుకుంది. ఈ డీల్ రద్దు కావడానికి నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ పరిణామాలు స్నాప్ భవిష్యత్తుపై , ఉద్యోగుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read :  గూగుల్ పేలో పాకెట్ మనీ ఐకాన్.. ఇది నొక్కితే డబ్బులు పోతాయా?

Advertisment
తాజా కథనాలు