భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా! అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిన్న భారీ నష్టాలతో ముగిశాయి. కేవలం నిన్న ఒక్క రోజు బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.19 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్ల వరకు భారీగా నష్టపోయాయి. By Kusuma 23 Oct 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అన్ని రంగాల స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నిన్న అయితే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు, నిఫ్టీ 309 పాయింట్ల వరకు నష్టపోయాయి. డాలరుతో రుపాయి విలువ 74.08 వద్ద ముగిసింది. ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే? కేవలం ఒక్క రోజు.. నిన్న ఒక్క రోజే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.19 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. ఉదయం సెన్సెక్స్ 81,558.08 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన కూడా చివరకు నష్టాల బాట పట్టింది. ఆఖరికి 930.55 పాయింట్ల నష్టంతో 80,220.72 వద్ద నష్టాలతో ముగిసింది. ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం సెన్సెక్స్‌లో మొత్తం 30 షేర్లలో 29 షేర్లు నష్టాలను ఫేస్ చేశాయి. కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే 0.67 శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.61% పెరిగి 74.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్‌లో అయితే సియోల్, టోక్యో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇది కూడా చూడండి: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ టాటా స్టీల్ 2.94%, ఎం అండ్ ఎం 3.79%, ఎస్‌బీఐ 2.91%, టాటా మోటార్స్ 2.64%, పవర్‌గ్రిడ్ 2.48%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.58%, మారుతీ సుజుకీ 2.14%, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.02%, ఎన్‌టీపీసీ 2.26%, ఎల్ అండ్ టీ 2.13%, టీసీఎస్ 1.53%, బజాజ్ ఫైనాన్స్ 1.58%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.73%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.86%, కోటక్ బ్యాంక్ 1.46%, యాక్సిస్ బ్యాంక్ 1.24%, ఏషియన్ పెయింట్స్ 1.49%,హెచ్‌సీఎల్ టెక్ 1.09% చొప్పున నష్టాల బాట పట్టాయి. ఇది కూడా చూడండి: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం #stock-markets మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి