మోటో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్! మోటోరోలా కంపెనీ తన లైనప్‌లో ఉన్న మోటో జీ75 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీని ధర భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.27,000గా నిర్ణయించబడింది. By Seetha Ram 02 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటోరోలా కొత్త ఫోన్ తాజాగా లాంచ్ అయింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రారంభించబడింది. ఇది 8జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 6జెన్ 3 చిప్‌సెట్‌తో వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. కెమెరా విషయంలోనూ ఈ ఫోన్ ఎక్కడా తగ్గలేదు. 50 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర, ఇతర స్పెసిఫికేషన్లు పూర్తిగా తెలుసుకుందాం. Moto G75 5G Price మోటో జి75 5జీ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర EUR 299 (దాదాపు రూ. 27,000)గా ఉంది. కాగా ఈ ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి ఆక్వా బ్లూ, చార్‌కోల్ గ్రే, సక్యూలెంట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది. దీనిని పలు బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఇది కూడా చదవండి: ఇదెక్కడి ఆఫర్ రా బాబు.. రూ.80 వేల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.12 వేలకే! Moto G75 5G Specifications మోటో జీ75 5జీ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల full-HD+ హూల్ పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz అడాప్టిప్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. అదే సమయంలో 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. దీని స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఇక దీని ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది Snapdragon 6 Gen 3 chipset ప్రాసెసర్‌తో వచ్చింది. కాగా ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌ను కలిగి ఉండగా.. వర్చువల్‌గా 16జీబీ వరకు విస్తరించవచ్చు. అదే సమయంలో మైక్రో ఎస్‌డీ కార్డును ఉపయోగించి స్టోరేజ్‌ను 1టిబి వరకు ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు. ఇది వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మాక్రో విజన్ సెన్సార్‌ను కలిగి ఉంది. అదే సమయంలో OISతో 50 మెగాపిక్సెల్ Sony LYTIA 600 సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది 30వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. #motorola #5g-smartphone #moto-g75-5g మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి