/rtv/media/media_files/2025/01/13/5el3vTn82MdgmvICNNmE.jpg)
jio offer Photograph: (jio offer)
సంక్రాంతి పండుగకు బంపర్ ఆఫర్‌తో జియో మళ్లీ వచ్చింది. ఈసారి ఈ టెలికాం దిగ్గజం జియో ఎయిర్ ఫైబర్, ఎయిర్ ఫైబర్ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం కాంప్లిమెంటరీ కానుక కింద యూట్యూబ్ ప్రీమియంను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వెంటనే అమల్లోకి వస్తుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో ఎడతెగని ప్రకటనలతో ఇబ్బంది పడిన వారందరికి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.
ఎలాంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్
దీనికి అర్హులైన వారు రెండేళ్ల పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్ కంటెంట్ చూడవచ్చు. అయితే యూజర్లు రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499లలో ఏదైనా ఒక ప్లాన్ ను కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ ఐదు ప్లాన్‌లలో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆఫర్ కింద యాడ్స్ లేని యూట్యూబ్, ఆఫ్ లైన్ డౌన్ లోడ్లు, బ్యాక్ గ్రౌండ్ ప్లే కేపబిలిటీస్ వంటి ఫీచర్లను ఉచితంగా పొందవచ్చు. కస్టమర్లు ఈ ఆఫర్లను మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోండి.
అయితే గత ఏడాది ఆగస్టులో ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి నెలవారీ విద్యార్థి ప్లాన్ ధర రూ.89, వ్యక్తిగత ప్లాన్ రూ.149, ఫ్యామిలీ ప్లాన్ రూ.299 గా ఉన్నాయి.
Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.
— Reliance Jio (@reliancejio) January 11, 2025
Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP
యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడం ఎలా
ముందుగా ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలి. తరువాత, మై జియో యాప్‌లో మీ అకౌంట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
అ తరువాత అందులో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి
ఆ తరువాత మీ యూట్యూబ్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి.
ఆ డిటెయిల్స్ తో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అయితే మీరు ఎలాంటి యాడ్స్ లేకుండా కంటెంట్‌ను చూడవచ్చు.
Also Read : Gold Rates: అబ్బా సాయిరాం : పండగపూట గుడ్ న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్