/rtv/media/media_files/2025/02/13/QVPI4euFwMiudTBAGow4.jpg)
honda new 2025 shine 125 bike launched in india
తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ అందించే ఒక మంచి బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే చీపెస్ట్ ధరలోనే ఇప్పుడొక బైక్‌ను కొనుక్కోవచ్చు బ్రదర్. అది మాత్రమే కాదు ఆ బైక్ మైలేజీలో కూడా తోపే. ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ హోండా పేద మధ్య తరగతి ఫ్యామిలీల కోసం అతి తక్కువ ధరలోనే.. భారీ మైలేజీ అందించే బైక్‌ను తాజాగా రిలీజ్ చేసింది.
2025 Shine 125
ఇప్పటికే పలు రకాల మోడళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్న హోండా తాజాగా 2025 Shine 125 బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బైక్ తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజీ ఇచ్చే మోడళ్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. లీటర్ పెట్రోల్‌తో ఈ బైక్ ఊహించనంత పరుగులు పరుగెడుతుంది.
ఇది కూడా చదవండి: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
అంతేకాకుండా దీని మెయింటనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. అందువల్లనే పేద మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని హోండా ఈ బైక్‌ను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. దీనిని ఎంతో ఆకర్షణీయమైన లుక్‌తో అందుబాటులో ఉంచింది.
ఇది కూడా చదవండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
Honda Motorcycle & Scooter India has launched the 2025 Honda Shine 125 with an OBD 2B compliant engine at ₹ 84,493 (ex-showroom).
— 91Wheels.com (@91wheels) February 13, 2025
✅ Updated engine to OBD 2B compliant
✅ Digital LCD instrument cluster
✅ New cluster displaying information about empty range, service reminder,… pic.twitter.com/JRYmMVIKe5
కాగా కంపెనీ దీనిని తక్కువ ధరలో తీసుకొచ్చింది. కేవలం రూ.84,493 ధరతో 2025 Shine 125 బైక్‌ను అందిస్తోంది. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధర. కాగా ఈ బైక్ మైలేజ్ విషయానికొస్తే.. ఇది లీటర్ పెట్రోల్‌కి 55 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్‌తో వచ్చింది.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
ఈ బైక్ 123.94 cc సింగిల్ - సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు పెడుతుంది. అదే సమయంలో ఇది 10.63 bhp పవర్, 11 Nm టార్క్‌ను ప్రొడ్యూ్స్ చేస్తుంది. ఈ బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను అమర్చారు. దీంతోపాటు ఈ బైక్‌లో మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.