Gold and Silver: మళ్ళీ పరుగులు తీస్తున్న బంగారం, వెండి ధరలు...

మధ్యలో కొంత తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు మళ్ళీ పరుగులు తీస్తున్నాయి.  రెండు రోజులుగా ఈ ధరల్లో బాగా పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు బంగారం ధర దాదాపు 670 రూ. లు పెరిగింది. అటు వెండి కూడా కేజీ మీద 2వేలు పెరిగినట్టు తెలుస్తోంది. 

New Update
gold prices

బంగారం, వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే గత రెండు రోజులుగా తగ్గిన వీటి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. అది కూడా ఒక్కసారే పైకి ఎగిశాయి. బలమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక నగల వ్యాపారుల డిమాండ్, పెళ్ళిల సీజన్...వీటన్నింటితో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తిరిగి ఊపందుకున్నాయి. ఈరోజు 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారంపైన రూ.760, 22 క్యారెట్ల గోల్డ్ పైన రూ.670 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం పెరిగిన ధరతో కలిపి రూ.78,110 కి చేరింది. మరోవైపు బంగారమే పెరిగితే నేనెందుకు పెరక్కూడదు అన్నట్టు.. కిలో వెండి మీద కూడా రూ.2వేలు పెరిగింది. ఈరోజు కిలో వెండి రూ.91,500లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో రేట్లు..

 హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం రూ78 వేల 110, 22 క్యారెట్ల గోల్డ్ 71 వేల 600గా ఉంది. నవంబర్ 28న అంటే నిన్న 22 క్యారెట్ల గోల్డ్ రూ.70వేల930 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.77 350లుగా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లు 77, 680 రూ. ఉంటే...22 క్యారెట్లు 71, 110 రూ. గా ఉంది. ముంబైలో రూ. 77,570, రూ. 71,110...చెన్నైలో రూ. 77,520, రూ. 71,060...చెన్నైలో రూ. 77,520, రూ. 71,060గా ధరలు ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే..ఢిల్లీలో రూ. 90,100 ఉన్న వెండి ధర..హైదరాబాద్‌లో రూ. 91,500..విజయవాడలో రూ. 91,500..చెన్నైలో రూ. 91,500..ఉండగా ముంబైలో మాత్రం ఢిల్లీలో ఉన్నట్టే 90, 100 రూ. గా ఉంది.

Also Read: TN: తిరుమంగై ఆళ్వార్ విగ్రహం ఇండియాకు వచ్చేస్తోంది...

Advertisment
Advertisment
తాజా కథనాలు