/rtv/media/media_files/2025/04/10/wgMGTFUWZhKSVlnfNoR7.jpg)
gold
పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో సాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నింగిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, పసిడికి భిన్నంగా వెండి ధరలు మాత్రం ఊహించని విధంగా భారీగా పతనమవ్వడం విశేషం.
మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ ధరపై ఏకంగా రూ. 1,310 పెరిగింది. దీంతో ధర రూ. 1,58,350 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర కూడా అదే బాటలో పయనించింది. 10 గ్రాముల బంగారంపై రూ. 1,200 మేర పెరిగింది. దీంతో ధర రూ. 1,45,150 పలుకుతోంది.
భారీ ఊరట
ఒకవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చాయి. కేజీ వెండి ధరపై ఏకంగా రూ. 15,000 మేర భారీ తగ్గింపు నమోదైంది. ఈ భారీ పతనంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,85,000 వద్ద కొనసాగుతోంది. వెండి ఆభరణాలు, వెండి వస్తువులు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా పసిడి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం, రూపాయి విలువ క్షీణించడం, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్లే బంగారం ధరలు ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow Us