/rtv/media/media_files/2025/02/10/liqpZ6uiX5f287h4cPxG.jpg)
bsnl cheapest recharge plan announced
BSNL New Recharge Plan: తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, అధిక డేటా కోసం ఎదురుచూస్తున్నారా?.. కానీ అలాంటి ఆఫర్ ఏ నెట్‌వర్క్‌లో ఉంటుందా అని తెగ సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ఊహకందని రీఛార్జ్ ప్లాన్‌ను అందుకుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో జియో, ఎయిర్‌టెల్ వంటి అగ్ర టెలికం సంస్థలకు గట్టి దెబ్బ పడనున్నట్లు తెలుస్తోంది.
Also Read: బంగ్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ డేవిల్ హంట్..1300 మంది అరెస్ట్!
రూ.1515 రీఛార్స్ ప్లాన్
BSNL తాజాగా ఏడాది ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను అతి చౌక ధరలోనే అందిస్తోంది. ఇందులో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను సైతం పొందొచ్చు. ఇప్పుడు దాని విషయానికొస్తే.. బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.1515 రీఛార్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందుతారు.
365 days of non-stop browsing!
— BSNL India (@BSNLCorporate) February 9, 2025
Get 2GB/day for just ₹1515 — one recharge, endless adventures!#BSNLIndia #BSNLPlans #ConnectingBharatAffordably pic.twitter.com/5m04gcUVDF
Also Read: డాంకీ రూట్ లో అమెరికా వెళ్తూ..పంజాబ్ యువకుడి మృతి!
అంతేకాదండోయ్ రోజుకి 2జీబీ డేటా కూడా లభిస్తుంది. ఇక డైలీ డేటా అయిపోయాక 40కెబిపిఎస్ స్పీడ్‌తో నెట్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. ఇందులో కాల్స్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు ఉండవు. దీని బట్టి రోజుకు రూ.4 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంత తక్కువ ధరలో ఇప్పటి వరకు డేటా ఇచ్చే ప్లాన్ మరొకటి లేదనే చెప్పాలి. అందువల్ల డేటా ఎక్కువగా ఉపోయోగించేవారికి ఇదొక అదిరిపోయే ఆఫర్‌గా చెప్పుకోవచ్చు.
Also Read: ఢిల్లీ ఫలితాలపై కోమటిరెడ్డి రియాక్షన్.. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్!
ఇదిలా ఉంటే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు ఓ షాకింగ్ న్యూస్. తన పాత ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ తొలగించబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. రూ.201, రూ.797, రూ.2999 వంటి రీఛార్జ్ ప్లాన్‌లను ఫిబ్రవరి 10 అంటే నేటి నుంచి తొలగించనుంది.
Also Read: వంటలో నల్ల మిరియాలు వాడితే బరువు తగ్గుతారా?