బెస్ట్ మైలేజ్ కార్లు.. కేవలం రూ.6 లక్షల లోపే..! బెస్ట్ మైలేజ్ కారు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. అందులో హ్యుందాయ్ ఎక్స్‌టర్, రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి సెలెరియో, 2024 స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను కేవలం రూ.6 లక్షల లోపు కొనుక్కోవచ్చు. By Seetha Ram 06 Oct 2024 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి https://rtvlive.com/business/tvs-company-has-launched-the-updated-radeon-all-black-base-edition-7285040దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు తమ లైనప్‌లో ఉన్న కొత్త కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు కేవలం కారు ధరను మాత్రమే చూసి కొనుక్కునే వారు.. ఇప్పుడు ధరతో పాటు సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ చూసి కొనుక్కుంటున్నారు. అదే సమయంలో మైలేజీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల పలు కంపెనీలు కంపెనీలు మైలేజీపై ఫోకస్ పెట్టి తక్కువ ధరలో అధిక మైలేజీని అందించే కార్లను మార్కెట్ లాంచ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా అధిక మైలేజీని అందించే ఒక మంచి కారును కొనుక్కోవాలని అనుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కేవలం రూ.6 లక్షల లోపే కొనుక్కోవచ్చు. హ్యుందాయ్ ఎక్స్‌టర్: హ్యుందాయ్ ఎక్స్‌టర్ టాప్ కార్ల జాబితాలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ కారు 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది 19 కి.మీ నుంచి 27 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు ధర విషయానికొస్తే.. ఇది రూ.5.99 లక్షల నుంచి రూ.10.43 ఎక్స్ షోరూమ్ మధ్య ఉంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 1.0 కె10 సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 24.44 కి.మీ నుంచి 32.72 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ కారు రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య లభిస్తుంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్: ఇది కూడా చదవండి: సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..! 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2 లీటర్ జెడ్12ఈ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 24.8 కి.మీ నుంచి 32.8 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ రూ.5.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్: మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ సీఎన్జీ వేరియంట్‌తో పాటు మరో 3 ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 23.56 కి.మీ నుంచి 34.04 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ కారు రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షల ఎక్స్ షోరూమ్ ధర మధ్య ఉన్నాయి. మారుతి సుజుకి సెలెరియో: మారుతి సుజుకి సెలెరియో సైతం తక్కువ ధరలో అధిక మైలేజీని అందించే కారుగా ఉంది. ఇది 1.0 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని కారణంగా ఈ కారు 25.17 కి.మీ నుంచి 34.43 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.04 లక్షల ఎక్స్ షోరూమ్ ధర మధ్య ఉంది. రెనాల్ట్ క్విడ్: రెనాల్ట్ క్విడ్ 1.0 లీటర్, 3-సిలిండర్, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 21.7 కి.మీ నుంచి 22 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ రెనాల్ట్ క్విడ్ కారు రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. #highest-mileage-cars మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి