/rtv/media/media_files/2026/03/17/credit-card-2026-03-17-07-31-53.jpg)
ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఉచిత లాంజ్ యాక్సెస్, సినిమా టికెట్ల ఆఫర్లు, రివార్డ్ పాయింట్ల వంటి ప్రయోజనాలను భారీగా తగ్గించేశాయి. కేవలం ప్రయోజనాలు తగ్గించడమే కాకుండా, వాటిని పొందడానికి వినియోగదారులు చేయాల్సిన కనీస ఖర్చు పరిమితిని కూడా పెంచేయడం గమనార్హం. ప్రీమియం సేవలకు పెట్టింది పేరుగా భావించే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ కోవలోనే నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తన 'ప్లాటినం ట్రావెల్ కార్డ్' రివార్డులను మార్చి 9 నుండి సగానికి తగ్గించింది. గతంలో రూ. 1.9 లక్షలు ఖర్చు చేస్తే 15,000 పాయింట్లు వచ్చేవి, కానీ ఇప్పుడు అవి కేవలం 7,500 పాయింట్లకే పరిమితమయ్యాయి. అలాగే రూ. 4 లక్షల ఖర్చుపై గతంలో ఇచ్చే 25,000 పాయింట్లు, రూ. 10,000 విలువైన తాజ్ వోచర్‌ను మార్చేసి, ఇప్పుడు కేవలం 10,000 పాయింట్లను మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ ఆ తాజ్ వోచర్ కావాలంటే వినియోగదారులు ఏకంగా రూ. 7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా
మరోవైపు ఎస్బీఐ కార్డ్ తన ఐదు పాపులర్ క్రెడిట్ కార్డులపై ఏటా ఇచ్చే 8 ఉచిత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సందర్శనలను 4కి తగ్గించి వినియోగదారులకు నిరాశ మిగిల్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన ప్లాటినం క్రెడిట్ కార్డులపై ఇచ్చే ఉచిత సినిమా టికెట్ల సౌకర్యాన్ని పూర్తిగా తొలగించింది. రవాణా ఖర్చుల ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్లపై కూడా నెలకు రూ. 20,000 వరకు మాత్రమేనని పరిమితి విధించింది. యాక్సిస్ బ్యాంక్ ఒక అడుగు ముందుకేసి, కార్డు క్లోజ్ చేసిన 30 రోజుల్లోనే రివార్డ్ పాయింట్లన్నీ గడువు ముగిసిపోయేలా నిబంధనలు మార్చింది.
స్మార్ట్ బై వోచర్ పాయింట్లను
ఫెడరల్ బ్యాంక్ భాగస్వామ్యంతో నడిచే స్కాపియా కూడా ఉచిత లాంజ్ యాక్సెస్ పొందడానికి ఉండాల్సిన కనీస నెలవారీ ఖర్చును రూ. 10,000 15,000 నుండి రూ. 20,000కి పెంచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఇన్ఫీనియా కార్డుపై స్మార్ట్ బై వోచర్ పాయింట్లను తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ, సోషల్ మీడియాలో వినియోగదారుల నుండి వ్యక్తమైన తీవ్ర నిరసనల కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ మార్పులన్నీ గమనిస్తే, ఇకపై క్రెడిట్ కార్డుల ద్వారా లాభాలు పొందడం సామాన్యులకు కొంత కష్టతరంగానే మారనుంది.
Follow Us