Amazon Lay Offs : అమెజాన్‌లో ఆగని లేఆఫ్స్: మరో 14,000 మంది ఇంటికే!

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

New Update
amazon

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే 2026 మే నెల నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఈ కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, హెచ్ఆర్ విభాగాల్లో పని చేసే మధ్య స్థాయి మేనేజర్లు, వైట్ కాలర్ ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఏడాది కాలంలోనే అమెజాన్ చేపట్టిన మూడవ భారీ తొలగింపు ఇదే అవుతుంది. గడిచిన ఏడాది జనవరిలో 16,000 మందిని, అంతకుముందు 2025 చివర్లో మరో 14,000 మందిని ఈ సంస్థ ఇప్పటికే తొలగించింది.

30,000 మందిని ఉద్యోగాల నుంచి

అమెజాన్ మాత్రమే కాకుండా మరికొన్ని పెద్ద కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇటీవలే ఒరాకిల్ సంస్థ తెల్లవారుజామున 6 గంటలకు మెయిల్ పంపి ఏకంగా 30,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. వీరిలో 12,000 మంది మన భారతీయులే ఉండటం గమనార్హం. వీరితో పాటు మైక్రోసాఫ్ట్, టీసీఎస్, యాక్సెంచర్, మెటా వంటి సంస్థలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీంతో టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పనితీరును అంచనా వేసే పద్ధతులు సరిగ్గా లేవని, దీనివల్ల ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియక చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు.

అమెజాన్ తన కంపెనీలో జరుగుతున్న ఈ మార్పులను సరికొత్త టెక్నాలజీ వైపు మళ్లించే ప్రయత్నంగా చూస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై భారీగా పెట్టుబడులు పెట్టాలని, సుమారు 125 బిలియన్ డాలర్లను డేటా సెంటర్స్ కోసం ఖర్చు చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ఏఐ ఏజెంట్ల వాడకం పెరగడం వల్ల కొన్ని పాత రకమైన ఉద్యోగాల అవసరం తగ్గుతుందని కంపెనీ సీఈఓ ఆండీ జస్సీ ఇదివరకే చెప్పారు. ఈ క్రమంలోనే చైనాలోని కొన్ని టీమ్స్‌ను పూర్తిగా మూసివేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కంపెనీని మరింత చురుగ్గా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ లేఆఫ్స్ జరుగుతున్నాయని సమాచారం.

Advertisment
తాజా కథనాలు