లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

New Update
లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

Bus Accident in Mexico: మెక్సికో నగరంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులతో పాటు మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పొయారు. 23 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం నయారిట్ రాష్ట్రంలో జరిగింది.

నయారిట్ రాజధాని టెపిక్‌ సమీపంలోని బరాంక బ్లాంకాలో ఈ ప్రమాదం గురువారం జరిగినట్లు సమాచారం. బస్సు లోయలో పడిన సమయంలో బస్సులో సుమారు 42 మంది వరకు ఉన్నట్లు సమాచారం. టిజువానా ప్రాంతానికి సమీపంలో ఉండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది.

చాలా ఎత్తు నుంచి బస్సు ఒక్కసారిగా కిందపడడంతో బస్సులోని ప్రయాణికుల్లో సుమారు 18 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు భారతీయులు(Indians), డొమెనిక్‌ రిపబ్లిక్‌, ఆఫ్రికా(Africa) దేశస్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లోయలో అంత చీకటిగా ఉండటంతో బస్సు ప్రమాద బాధితులను వెలికి తీయడం చాలా కష్టంగా మారింది. ఎంతో కష్టపడి మృతదేహాలను బయటకు తీసినప్పటికీ వాటిని గుర్తించేందుకు చాలా కష్టంగా ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు మెక్సికో(Mexico) బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ.. మలుపులు ఎక్కువగా ఉన్న రోడ్డుపై డ్రైవర్​.. బస్సును అతివేగంగా నడపటం వల్లే ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు లోయలో పడిపోయినట్లు తెలుస్తుంది. దీని పై విచారణ చేపట్టమని అతి త్వరలోనే బస్సు ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా వలసదారులని సమాచారం. మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని సహాయక సిబ్బందిలో ఒకరు తెలిపారు. కాగా...మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత నెలలో ఓక్సాకాలో జరిగిన బస్సు ప్రమాదంలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్​ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో 17మంది మరణించారు. వీరందరు వలసదారులే!

Also Read: అమెజాన్‎లో డిస్కౌంట్ ఫెస్టివల్…ఐఫోన్, ఐప్యాడ్‎లపై భారీ తగ్గింపు…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు