BRS: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్!

2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం ఎదుర్కొంది. 17 స్థానాల్లో కనీసం ఒక్కచోట గట్టిపోటీ ఇవ్వలేక జీరోకు పడిపోయింది. మహబూబాబాద్, ఖమ్మంలో 2, 14 స్థానాల్లో 3, హైదరాబాద్ లో 4 ప్లేస్ కు పరిమితమైంది. కేసీఆర్ పతనానికి కారణలేంటో పూర్తి ఆర్టికల్ లో చదవేయండి.

New Update
BRS: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్!

Lok sabha: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. 2019 ఎన్నికల్లో 9 స్థానాలను కైవసం చేసుకున్న కేసీఆర్ పార్టీ.. ఈసారి జీరోకి పడిపోయి ఘోరమైన ఫలితం చవిచూసింది. మహబూబాబాద్, ఖమ్మం రెండు స్థానాలు మినహా మిగతా స్థానాల్నింటిలో మూడో స్థానంలోనే నిలిచింది. హైదరాబాద్ లో మరి దారుణంగా నాలుగో ప్లేస్ కు పరిమితమైంది. బీఆర్ఎస్ అభ్యర్థులో ఏ ఒక్కరూ గట్టిపోటీ ఇవ్వకపోగా.. కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టకున్న ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం దారుణంగా విఫలమయ్యారు. నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి దిగిన ప్రవీణ్ కుమార్ సైతం మూడో స్థానానికే పరిమితమయ్యారు. గతేడాది 3 సీట్లు గెలిచిన కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ నుంచి ఐదు స్థానాలను గెల్చుకోగా.. మిగిలిన నాలిగింటిని బీజేపీ దక్కించుకుంది.

ఇదే బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014లో 11 ఎంపీ సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 2019లోనూ 9 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఈసారి 17 ఎంపీ స్థానాల్లో ఒక్క దాంట్లో కూడా బలమైన పోటీ ఇవ్వకపోవటం గమనార్హం. కాగా ఎన్నికల ముందు ఏ జాతీయ పార్టీకి కచ్చితమైన మెజార్టీ రాదని.. ఎన్డీఏ, ఇండియా కూటమిలకు ధీటుగా థర్డ్ ఫ్రంట్ వస్తుందన్నారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తాయని పదే పదే చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర విషయం పక్కనపెడితే తెలంగాణలో ఖాతా కూడా తెరవకపోవటం ఘోర అవమానంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని, కీలక నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావడం కూడా బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా మారింది.

ఇది కూడా చదవండి: Chandrababu: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కేబినెట్‌ పదవులపై కీలక చర్చ!

ఏ ఒక్కరూ పోటీ ఇవ్వలేదు..
మహబూబాబాద్ మాలోత్ కవిత, ఖమ్మం లో నామ నాగేశ్వర రావు రెండో స్థానంలో నిలిచారు. అదిలాబాద్ లో ఆత్రం సక్కు, భువనగిరిలో క్యామా మల్లేష్, చేవెళ్ల లో కాసాని జ్ఞానేశ్వర్, కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్, మహబూబ్ నగర్ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్ గిరి రాగిడి లక్ష్మారెడ్డి, మెదక్ వెంకట్రామ రెడ్డి, నాగర్ కర్నూల్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ కంచర్ల క్రిష్ణ రెడ్డి, నిజామాబాద్ గొవర్ధన్ బాజిరెడ్డి, పెద్దపల్లి ఈశ్వర్ కొప్పులు, సికింద్రాబాద్ పద్మారావు, వరంగల్ మారపల్లి సుధీర్ కుమార్, జహిరాబాద్ గాలి అనిల్ కుమార్ 3 స్థానాలకు పరిమితమయ్యారు. హైదరాబాద్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ 4వ స్థానంలో నిలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు