Delhi : నేడు కవిత బెయిల్ మీద విచారణ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ మీద ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని..మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు కవిత. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు. By Manogna alamuru 01 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ జ్యుడిషియల్ కస్టడీ మీద తీహార్ జైల్లో(Thihar Jail) ఉన్నారు. ఈరోజు ఆమె పెట్టిన మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) విచారణ చేయనుంది. తన కుమారుడికి పరీక్షలు కారణంగా కవిత మధ్యంతర బెయిల్ కోరారు. ఋ నెల 11 నుంచి 16 వరకు తన కొడుక్కి పరీక్షలు ఉన్నాయని..తాను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉందని కోరుతూ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ పెట్టారు. అదే సమయంలో సాధారణ బెయిల్ మీద కూడా విచారణ చేపట్టాలని ఆమె కోరుతున్నారు. అయితే లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని...కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అడుగుతోంది. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిరాశే ఎదురైంది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆమె తీహార్ జైలు కు వెళ్ళక తప్పలేదు. ట్రయల్ కోర్టు రిమాండ్ విధించాక ఆమెను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. అక్కడ కవితకు ఖైదీ నంబర్ 666(Khaidi No 666) ను కేటాయించారు జైలు అధికారులు. ఈ నెల 9వ తేదీ వరకు ఇదే జైల్లో కవిత ఉండనున్నారు. తాను క్లీన్‌గా బయటకు వస్తా.. మరోవైపు తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను ఏ తప్పూ చేయలేదని… కచ్చితంగా బయటకు వస్తానని అంటున్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని…పొలిటికల్ లాండరింగ్ కేసని అంటున్నారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చేమో కానీ… తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బ తీయలేరని చెప్పారు కవిత. Also Read : ఇంటి భోజనం ఇవ్వట్లేదు.. కోర్టులో కవిత పిటిషన్! #kavitha #delhi-liquor-scam #rouse-avenue-court #bail #brs-mlc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి