BRS MLA: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే? మంత్రి పొన్నం ప్రభాకర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతన్నట్లు ప్రచారం జరిగింది. ఆర్టీవితో మాట్లాడిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు. By V.J Reddy 18 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Politics: తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేర్చుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి గుంజేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు! బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పొన్నం భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తో కూడా మంత్రి పొన్నం భేటీ అయ్యారు. మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఇంట్లో కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వారు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. అందుకే కలిశాం.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అవ్వడం.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడంపై ఆర్టీవీ ద్వారా వివరణ ఇచ్చారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్. కాంగ్రెస్ లో తాము చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. గౌడ సంఘం సమావేశంపైనే మంత్రి పొన్నంతో చర్చినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. స్వామిగౌడ్ దారెటు.. బీఆర్‌ఎస్‌లో చేరి మండలి ఛైర్మన్‌గా పని చేశారు స్వామిగౌడ్. ఆ తర్వాత బీజేపీలో చేరారు. మొన్నటి ఎన్నికల ముందు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. స్వామిగౌడ్‌తో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలతో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం! DO WATCH: #mla-prakash-goud #minister-ponnam-prabhakar #telangana-latest-news #brs-mla-joins-congress #brs-mla #swami-goud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి