KTR : రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి కవితను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్ చేశారు. '' ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా.. ఎలాంటి కష్టంలోనైన నీ వెంట ఉంటా అంటూ" ట్వీట్ చేశారు. By B Aravind 19 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rakhi Festival : సోమవారం రాఖీ పండుగ సందర్భంగా అందరి ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. అక్కా చెల్లెళ్లు.. అన్నాదమ్ముళ్లకు రాఖీ (Rakhi) కడుతూ తమ బంధాన్ని, ప్రేమను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) తన సోదరి కవిత (Kavitha) ను గుర్తుచేసుకుంటూ ఎక్స్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. '' ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా.. ఎలాంటి కష్టంలోనైనా నీ వెంట ఉంటా అంటూ'' ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. You may not be able to tie Rakhi today But will be with you through thick and thin ❤️#Rakhi 2024 pic.twitter.com/mQpfDeqbkc — KTR (@KTRBRS) August 19, 2024 Also Read: ప్రతి గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ? గతంలో ఓ సారి జరిగిన ఇంటర్వ్యూలో కవిత.. కేటీఆర్ గురించి ఫన్నీగా కామెంట్స్ చేశారు. మీ అన్నకి రాఖీ కడితే ఎంత డబ్బిస్తారని యాంకర్ అడిగారు. దీనికి స్పందించిన కవిత.. మా అన్న కొంచెం పిసినారి అని చాలా తక్కువగా ఇస్తాడంటూ నవ్వుతూ చెప్పారు. ఇదిలాఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవిత.. ప్రస్తుతం రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. Also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్ #ktr #telugu-news #kavitha #rakhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి