KTR: త్వరలో కేసీఆర్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండే గా మారకతప్పదని.. త్వరలోనే కేసిఆర్‌ను సీఎంను చేసుకుందామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బట్టలు ఊడదీసి కొడుతాం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 24 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLA KTR: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని అన్నారు. కేసీఆర్ ను త్వరలో సీఎం అయ్యేలా చూడాలని కరీంనగర్ లో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అని సంబోధించారు కేటీఆర్. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు అలాంటి మెసేజిలు పెట్టొద్దు.. మొన్నటి ఫలితం మనం ఇంట్లో దుప్పటి కప్పుకునేలా ఉందని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. ప్రజలను కించపరిచేలా భావోద్వేగాలతో సోషల్ మీడియా మెసేజిలు పెట్టవద్దని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో అన్నారు. ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాం... నాయకులను మోసం చేసిన ప్రజలను చూశామని సోషల్ మీడియా లో మెస్సెజ్ పెట్టడం మంచిది కాదని అన్నారు. 1.85 శాతం ఓట్లతేడాతో ఓడిపోయాం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.85 శాతం ఓట్లతేడాతో ఓడిపోయామని అన్నారు కేటీఆర్. వన్ థర్డ్ సీట్లు గెలుచుకున్నాం... 14 సీట్లలో స్వల్ప ఓట్లతేడాతో ఓడిపోయామన్నారు. దరిద్రమైన ఓటమికాదు.. ప్రజలు మనల్ని చీకొట్టినట్లు కాదని పేర్కొన్నారు. సెంటిమెంట్ తో కాంగ్రెస్ గెలిచింది తప్ప...మనవాళ్ళు మంచోళ్ళు కాదని ఓడించలేదని తెలిపారు. బట్టలు ఊడదీసి కొడుతాం.. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీ హామీలు కాదు, 420 హామీలు అని చురకలు అంటించారు కేటీఆర్. బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఇలా అన్ని కలిపి హామీలు 420 ఉన్నాయని పేర్కొన్నారు. 420 హామీలు అమలు చేయలేకపోతే బట్టలు ఊడదీసి కొడుతాం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డి... గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండని సెటైర్లు వేశారు మాజీ మంత్రి కేటీఆర్. గుంపు మేస్త్రీ దావోస్ కు పోయి అబద్ధాలతో అడ్డగోలు మాట్లాడారని మండిపడ్డారు. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడుతా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. రైతు బంధు పడిని రైతులు చెప్పుతో కోడుతారో ఓటుతో కొడుతారో ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 45 రోజుల్లో అనేక మందిని శత్రువులుగా చేసుకుందని అన్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు మహిళలు కొట్టుకుంటున్నారు.. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆర్టీసీ ఫ్రీ బస్ ప్రయాణం పథకంతో మహిళా సోదరుమణులు కొట్టుకుంటున్నారని అన్నారు కేటీఆర్. కరీంనగర్ కు చెందిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్రీ బస్ పెట్టే ముందు ఆలోచించరా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కోటి 57 లక్షల మంది 18 ఏళ్ళ పైబడిన మహిళలు ఉన్నారని.. వారందరికీ నెలకు 2500 ఇవ్వాలి... లేకుంటే సోషల్ మీడియా వేదికగా తాటతీయాలి అని బీఆర్య్స్ నేతలకు పిలుపునిచ్చారు కేటీఆర్. కేసీఆర్ ను సీఎం చేద్దాం.. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండే గా మారకతప్పదని జోస్యం చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని అన్నారు. బిజేపి బిఆర్ఎస్ ఒక్కటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, గజ్వెల్, దుబ్బాక, హుజురాబాద్ లో బిఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో ఉన్నారు.. ఎవరు ఎవరికి బీ టీమ్ చెప్పండి అని ప్రశ్నించారు. త్వరలోనే కేసిఆర్ ను సీఎం ను చేసుకుందాం అని అన్నారు. DO WATCH: #ktr #kcr #cm-revanth-reddy #brs-party #congess-six-guarantess మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి