Rythu Bandhu: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎల్లుండే ఖాతాల్లోకి రైతుబంధు.. సర్కార్ కీలక నిర్ణయం! రైతుబంధు నిధులు జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ అనుమతిచ్చినప్పటికీ ఈ నిధులు రైతుల ఖాతాల్లో ఇంకా జమకాలేవు. శని,ఆది, సోమవారాలు వరుసగా బ్యాంకులకు సెలవు రోజులు కావడంతో.. నవంబర్ 28న రైతు బంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. By B Aravind 26 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో యాసంగి సీజన్ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన సంగతి తెలిసిందే. కానీ ఆ నిధులు ఇంకా జమ కాలేదు. శనివారం, ఆదివారం, సోమవారాలు వరుసగా సెలవుదినాలు కావడంతో నవంబర్ 28న మంగళవారం రోజున నిధులు జమ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. యాసంగి సీజన్ కోసం రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు ఆర్థికసాయం చేసేందుకు ఎలక్షన్ కమిషన్ శుక్రవారం రాత్రి అనుమతించింది. అయితే దీన్ని ఈ నెల 28 లోపే పూర్తి చేయాలని ఆదేశించింది. దీనికి తగ్గట్లుగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో అర్హులైనటువంటి 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపించాయి. Also read: పాతబస్తీలో ఐటీ రైడ్స్: బడా వ్యాపారులే టార్గెట్ అయితే దీనికి అనుగుణంగా ఆర్థికశాఖ రూ.7,700 కోట్లను ట్రెజరీల నుంచి నిధులను బ్యాంకులకు బట్వాడా చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమవుతాయి. అయితే శని, ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేగు. ఇక చివరగా.. మంగళవారం మళ్లీ పనిదినం కావడంతో... ఆ రోజునే ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారంగానే ఆ రోజు సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ తెలిపారు. అయితే మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్రంలోని ట్రెజరీ, వ్యవసాయాధికారులకు శనివారమే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు కూడా ముగియనుంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపులు జరగనున్నాయి. #telugu-news #telangana-news #telangana-election-2023 #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి