Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు.

New Update
Niranjan Reddy: ఐదెకరాలలోపు రైతులకు రైతుభరోసా ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్

Ex Minister Niranjan Reddy: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని ఫైర్ అయ్యారు.

ఏం జరగలేదు..

ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా తెలంగాణలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం లేదు.. ప్రత్యామ్నాయం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఏం చేసింది? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం అని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవని పేర్కొన్నారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని అన్నారు.

ALSO READ: వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

మేడిగడ్డ కుంగిపోతే..

మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. హరీష్ రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని తెలిపారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరం అని అన్నారు. 15 మాసాల క్రితం హిమాచల్, 8 మాసాల క్రితం కర్ణాటకలో, 72 రోజుల క్రితం 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయిందని గుర్తు చేశారు.

కరంటు కోతలు..

తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి .. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది.. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్దం అని అన్నారు.

అన్యాయం చేయవద్దు..

బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దని కోరారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదని అన్నారు. పేర్లు మారుస్తారా ? ఏం చేస్తరో ప్రజలకు అందాల్సినవి అందేలా చూడండి అని పేర్కొన్నారు. ఆలేరు మెడికల్ కళాశాల కొడంగల్ కు తరలించడం పద్దతికాదని అన్నారు.

DO WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. ఒక మహిళ వేరొక మహిళ తల్లిని తిట్టిందని జుట్టు పట్టుకుని కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
noida woman grabs another by hair pins her down viral video

noida woman grabs another by hair pins her down viral video Photograph: (noida woman grabs another by hair pins her down viral video)

నోయిడాలోని ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదం తీవ్రతరమైంది. దాని ఫలితం దారుణమైన దాడికి దారితీసింది. ఓ మహిళ వేరొక మహిళ జుట్టు పట్టుకుని రప్పా రప్పా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు గొడవ పడితే.. అది ఎంతవరకు అయినా దారి తీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది నడి రోడ్డు అని కూడా చూడరు. అయ్యో అందరూ ఉన్నారులే అని సైలెంట్‌గా ఉండరు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు జుట్లు పట్టుకుని బాదుకుంటారు. తాజాగా అలాంటిదే నొయిడాలో జరిగింది. 

ఏం జరిగిందంటే?

సెక్టార్ 168లో ఉన్న నోయిడా సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా.. అతి దారుణంగా తిట్టుకున్నారు. అది కాస్త తిట్లతో ఆగకుండా కొట్లాట వరకు వెళ్లింది. ఆ ఇద్దరు మహిళలు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వారిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు వీరిద్దరిలో ఒక మహిళ వేరొక మహిళ తల్లిపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది. అలా మాటల యుద్ధం సాగిన తర్వాత చల్లబడ్డారు. 

కానీ ఒకే దగ్గర ఉండటంతో.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి వివాదం మరింత దారుణంగా మారింది. ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని వదలకుండా కొట్టింది. పక్కనే ఉన్నవారు విడిపించాలని చూసినా ఆమె జుట్టు వదల్లేదు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment