KCR: సీఎం రేవంత్‌పై ఈడీ, ఐటీ విచారణ జరపాలి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు TG: కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ 'R ట్యాక్స్' వసూల్ చేస్తున్నారని సభలో మోడీ అన్నారని.. ఇద్దరు ఒకటి కాకపోతే సీఎం రేవంత్‌పై సీబీఐ, ఐటీ విచారణకు మోడీ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. By V.J Reddy 30 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి R ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని సభలో మోడీ అన్నారని అన్నారు. ఇద్దరు ఒకటి కాకపోతే సీఎం రేవంత్ పై సీబీఐ, ఐటీ విచారణకు మోడీ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోడీ అంటున్నారని వ్యాఖ్యానించారు. మోడీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదు అని ప్రశ్నించారు. పైకి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారని.. మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని ఆరోపణలు చేశారు. Your browser does not support the video tag. ALSO READ: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ పై మోడీ కామెంట్స్.. అందోల్ సభలో రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం RR ట్యాక్స్ తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలోని వ్యాపారాలు, కాంట్రాక్టర్లు RR ట్యాక్స్ కడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ R ట్యాక్స్ తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు. RR ఎవరో మీకు అర్ధమై ఉంటుందని వ్యాఖ్యానించారు. RR ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కొత్త అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో పడిందని అన్నారు. #cm-revanth #kcr #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి