CM KCR: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?

బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుకు రోడ్డు రోలర్ కష్టాలు తప్పాయి. సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయినా సీఎం కేసీఆర్ వ్యూహం మాత్రం ఫలించింది. రోడ్డు రోలర్ గుర్తు కలిగిన యుగతులసి పార్టీ నామమాత్రంగా పోటీ చేయడానికి సిద్ధమైంది. అసలేం జరిగిందంటే...

New Update
CM KCR: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. రోడ్ రోలర్ సింబల్ కు చెక్.. ఎలాగో తెలుసా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా అనుకున్నారంటే అది జరిగిపోవాల్సిందే. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు తర్వాత చాలా వచ్చాయి. రోడ్ రోలర్, రోటీ మేకర్, ఆటో ఇలాంటివి. ఇవి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ఇవి చూడ్డానికి కార్ లాగే ఉండడంతో గత ఎన్నికల్లో కొంతమంది బీఆర్ఎస్ కు వేస్తున్నామనుకుని ఇతర పార్టీలకు ఓటు వేసేశారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓట్లను కోల్పోయింది. ఈ సారి అలా జరగకూడదని ఈ గుర్తులను రద్దు చేయమంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో కేసీఆర్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

Also Read:వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు..భారీగా తరలి వెళుతున్న డబ్బు

అయితే డైరెక్ట్ గా అవ్వకపోతేనేమి అటునుంచి నరుక్కొద్దాం అనుకున్నారు. రాజకీయంలో పండిపోయిన బుర్రతో సరైన సమయంలో సరైన వ్యూహం రచించారు. రోడ్ రోలర్ గుర్తు కలిగిన యుగ తులసి పార్టీ ఛీఫ్ శివకుమార్ దంపతులను ప్రగతి భవన్కు పిలిపించుకుని మాట్లాడారు. శివకుమార్ ను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. యుగ తులసి పార్టీ నామమాత్రంగా అంటే 5 శాతం సీట్లు, ఓట్లు కోసం మాత్రమే పోటీ చేసేలా ఒప్పించారు.

yuga tulasi

దీనికోసం యుగతులసి పార్టీకి కేసీఆర్ బోలెడు హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యుగ తులసి ఫౌండేషన్ తన సేవలను మరింత విస్తరించేలా కృషి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే గోవుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పారట. కేసీఆర్ నుంచి ఫుల్ భరోసా పొందిన తర్వాతనే యుగ తులసి ఛీఫ్ శివకుమార్ వెనక్కి తగ్గారని.. నామ మాత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. అయితే ఈ హామీల విషయం కేవలం సమాచారం మాత్రమే. వీటి గురించి అధికారికంగా ఏమీ ప్రకటన మాత్రం రాలేదు.

Also Read:ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం..లాక్ డౌన్ విధించే ఛాన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు