Bade Nagajyothi : రాసిపెట్టుకో...గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!

New Update
Bade Nagajyothi : రాసిపెట్టుకో...గెలుపు నాదే..బడే నాగజ్యోతి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ..!!

కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. స్కాంల పార్టీ..కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజల నుంచి తనకు మంచి ఆదరణ లభిస్తుందని..భారీ మెజార్టీ గెలిపించుకుంటామని చెబుతున్నారని తెలిపారు. సెంటిమెంట్ చూపించి..ఓట్లు దండుకపోయే నాటకాలే తప్పా సీతక్క చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా ఓడిపోవడం గ్యారెంటీ అన్నారు. ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను ఇంటికి పంపివ్వడం ఖాయమంటున్న బడే నాగజ్యోతి పూర్తి ఇంటర్వూ ఈ వీడియోలో చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి:  ఈటలను ఓడిస్తా.. హుజూరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తా.. ప్రణవ్ సంచలన ఇంటర్వ్యూ..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వానివే.. సుప్రీంకోర్టుకు చెప్పిన తెలంగాణ సర్కార్

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది.ఈ భూమి ఎప్పుడూ కూడా అటవీ రికార్డుల్లో లేదని చెప్పింది. కొన్నేళ్లుగా న్యాయవివాదంతో ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల చెట్లు పెరిగాయని తెలిపింది.

New Update
Kancha gachi bowli Land

Kancha gachi bowli Land


కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది. ఈ భూమి ఎప్పుడూ కూడా అటవీ రికార్డుల్లో లేదని చెప్పింది. ఇటీవల ఆ 400 ఎకరాల భూమి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో జస్టిస్ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకొని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించింది. ఈ వ్యవహారంపై 5 ప్రశ్నలు సందిస్తూ.. ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. 

Also Read: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

1. అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్టను కొట్టివేసి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకొచ్చింది. 
2. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న అభివృద్ధి కార్యకలాపాలకు పర్యావరణ ప్రభావ ముదింపు సర్టిఫికేట్ ఉందా ?
3. చెట్ల నరికివేతకు అటవీ, ఇతర స్థానిక చట్టాల కింద ఏమైన పర్మిషన్లు తీసుకున్నారా ? 
4. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణ కమిటీలో అటవీ ప్రాంతాలను గుర్తించే దానితో సంబంధం లేని అధికారులను ఎందుకు తీసుకున్నారు ?
5. ఇప్పటిదాకా కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది ? 

ఇలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుప్రీకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి దీనిపై అఫిడవిట్ దాఖలు చేసింది. అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా దీనిపై న్యాయవివాదం కొనసాగడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల చెట్లు పెరిగాయని తెలిపింది.  ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది. 

Also Read: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్‌.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్

''ఈ భూమి ఓపెన్‌గా ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చివెళ్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతాయి, కానీ వీటికి ఇక్కడ ఆవాసం లేదు. ఈ ప్రాంతంలో అభివ-ృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం. అక్కడ మొక్కల్ని పెంచుతామని'' రాష్ట్ర ప్రభుత్వం తెలపింది.

 hcu | Kancha Gachibowli land dispute | rtv-news 

Advertisment
Advertisment
Advertisment